Brain: ఈ 13 అలవాట్లలో ఏ ఒక్కటి మీకు ఉన్నా బ్రెయిన్ మటాషే.. ఎందుకైనా మంచిది.. ఒకసారి చెక్ చేసుకోండి..!
ABN , First Publish Date - 2023-02-18T11:53:10+05:30 IST
మన అలవాట్లనేవి రెగ్యులర్ ప్రాక్టీస్‌తో కూడుకున్నవి. మనం పూర్తిగా వాటిపై ఆధారపడతాం. కొన్ని అలవాట్లు మనల్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. కానీ వాటిని మనం గుర్తించం. కొన్ని అలవాట్లు చాలా హానికరంగా మారి చివరకు మన బ్రెయిన్ డ్యామేజ్‌కు కూడా దారి తీస్తాయి.
Brain : మన అలవాట్లనేవి రెగ్యులర్ ప్రాక్టీస్‌తో కూడుకున్నవి. మనం పూర్తిగా వాటిపై ఆధారపడతాం. కొన్ని అలవాట్లు మనల్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. కానీ వాటిని మనం గుర్తించం. కొన్ని అలవాట్లు చాలా హానికరంగా మారి చివరకు మన బ్రెయిన్ డ్యామేజ్‌కు కూడా దారి తీస్తాయి. బ్రెయిన్ అనేది మనిషి శరీరంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మెదడు బాగా పనిచేయడానికి వ్యాయామం, పోషకాహారం కూడా అవసరమే. ముఖ్యంగా 13 అలవాట్లు మన బ్రెయిన్ డ్యామేజ్‌కు కారణమవుతాయి. అవేంటో తెలుసుకుందాం.
1. బ్రేక్‌ఫాస్ట్ మానేయడం..
ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే మన బ్రెయిన్ చాలా చురుకుగా పనిచేస్తుంది. అదే మానేస్తే.. బాడీలోని షుగర్ లెవల్ తగ్గుతుంది. మెదడు పనిచేయడానికి ప్యూర్ గ్లూకోజ్ అవసరం. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోవడం వలన మెదడు కణాల క్షీణత వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి.
2. అతిగా తినడం..
అతి ఎప్పుడూ అనర్ధమే. మితంగా తింటే భోజనం ఔషధమవుతుంది. అతిగా తింటే విషమవుతుంది. అది మన బ్రెయిన్‌ని కూడా దెబ్బతీస్తుంది. అతిగా తినడమనేది అల్జీమర్స్‌కు దారితీస్తుంది. అతిగా తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. తద్వారా మెదడులోని రక్త నాళాలు గట్టిపడతాయి. దీని వలన మెదడు కణాలకు రక్త సరఫరా తగ్గుతుంది. ఇది మెదడు పనితీరును పెద్ద ఎత్తున దెబ్బ కొడుతుంది.
3. నిద్ర లేమి..
నిద్రలేమి అనేది మతిపరుపుకు దారి తీస్తుంది. తగినంత నిద్ర లేకుంటే మెదడు కణాలు చచ్చిపోతాయి. కాబట్టి రోజుకు కనీసం 7 గంటల నిద్ర తప్పనిసరి.
4. షుగర్‌తో కూడా పదార్థాలు తినడం..
మనం తీసుకునే ఆహారంలోనూ.. బేవరేజెస్‌లోనూ తెలిసో తెలియకో షుగర్‌ను తీసుకుంటూనే ఉంటాం. రిఫైన్డ్ షుగర్స్.. మన బ్రెయిన్, బాడీలోని ప్రోటీన్లు, న్యూటియంట్స్‌ను శోషించుకుంటాయి. ఇది మన బ్రెయిన్ డ్యామేజ్‌కు కారణమవుతుంది.
5. ధూమపానం..
ధూమపానం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో బ్రెయిన్ డ్యామేజ్ కూడా ఒకటి. మెదడులోని పెద్ద మొత్తంలో సెల్స్‌ను కుంచించుకుపోయేలా చేస్తుంది. చివరకు ప్రాణాపాయంగా పరిణమిస్తుంది.
6. పడుకునేటప్పుడు తలను కవర్ చేసుకోవడం..
తల కవర్ చేసుకుని పడుకుంటే.. కార్బన్ డై ఆక్సైడ్ గాఢత పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో ఆక్సిజన్ గాఢత మరింత తగ్గుతుంది. ఆక్సిజన్ సరఫరా సరిగా లేకుంటే మెదడు పనితీరు తగ్గిపోతుంది. దీంతో సరిగా ఊపిరాడక.. నిద్ర లేమితో అలసట, మత్తుగా ఉండటం వంటివి జరగొచ్చు.
7. అనారోగ్యంతో ఉన్నప్పుడు పనిచేయడం..
అనారోగ్యం బారిన పడినప్పుడు కూడా పని చేస్తే అప్పుడు మెదడు సమర్థత దెబ్బతింటుంది. నిజానికి మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి మన బ్రెయిన్, బాడీ మరింత ఎక్కువగా పని చేస్తాయి. ఇక అనారోగ్యంతో కూడా పని చేస్తే.. మెదడు మరింత ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది.
8. ఎవ్వరితోనూ కలవకపోవడం
కొంతమంది ఎవ్వరితోనూ కలవరు.. మాట్లాడరు. ఇది బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ని దెబ్బతీస్తుంది. ఇతరులతో మాట్లాడటం.. యాక్టివ్‌గా ఉండటం వంటివి మెదడును బలోపేతం చేస్తాయి. అది పని చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
9. వ్యాయామం
ఆటలు, ఎలాంటి వ్యాయామం చేయకపోవడం వంటివి బ్రెయిన్‌ను డ్యామేజ్ చేస్తుంది. వ్యాయామం అనేది ఎండార్ఫిన్ అనే సంతోషకరమైన హార్మోన్‌లను విడుదల చేస్తుంది. దీని వల్ల మెదడు మాత్రమే కాదు.. గుండె, ఊపిరితిత్తులు కూడా సవ్యంగా పనిచేస్తాయి.
10. మద్యం సేవించడం..
ఆల్కహాల్ అతిగా తీసుకోవడం వల్ల బ్రెయిన్ కణాలు పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతాయి. దీర్ఘకాలిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మెదడు పరిమాణం తగ్గుతుంది.
11. కలుషిత రసాయనాలు/కాలుష్యం..
మన మెదడు పూర్తిగా ఆక్సిజన్‌పై ఆధారపడి ఉంటుంది. హానికరమైన రసాయనాలు లేదా కలుషితమైన గాలికి మిమ్మల్ని మీరు ఎంత ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేసుకుంటే.. అంత ఎక్కువగా మెదడుకు ఆక్సిజన్ చేరిక తగ్గిపోతుంది. శరీరంలో తగినంత ఆక్సిజన్ లేకపోవడం మెదడులోని కణాల చనిపోవడానికి కారణమవుతుంది.
12. స్ట్రెస్..
ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి ఒక భాగం. కానీ ఒత్తిడి మీ సామర్థ్యాన్ని అధిగమించినప్పుడు, అది మెదడు సాధారణ పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది.
13. స్టిమ్యులేటింగ్ ఆలోచనలు లేకపోవడం..
మెదడుకు పని కల్పించాలి. తరచుగా తగినంతగా ఆలోచించని వ్యక్తులకు మెదడు పరిమాణం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆలోచించడం, చదవడం, రాయడం వల్ల మెదడు మెరుగ్గా పనిచేస్తుంది. అందువల్ల మెదడు సక్రమంగా పని చేయడానికి ఆలోచించడం చాలా అవసరం.