Hair Benefits: కొబ్బరి నూనెలో దీన్ని కూడా కలిపి రోజూ రాసుకోండి చాలు.. ఏడు రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే..!

ABN , First Publish Date - 2023-09-11T14:59:16+05:30 IST

దీన్ని 7 సార్లు ఉపయోగించిన తర్వాత, జుట్టులో మందం, నలుపు రెండింటినీ చూస్తారు.

Hair Benefits: కొబ్బరి నూనెలో దీన్ని కూడా కలిపి రోజూ రాసుకోండి చాలు.. ఏడు రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే..!
hair fall

ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న విపరీతమైన సమస్యల్లో జుట్టురాలే సమస్య ప్రధానమైనది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వెంట్రుకలు తెల్లబడుతూ, జుట్టురాలే సమస్య కనిపిస్తూనే ఉంది. దీనికి ప్రధానంగా చాలా కారణాలే ఉన్నాయి. వాతావరణంలో కాలుష్యం పెరగడం నుంచి, సరైన ఆరోగ్యకరమైన జీవన శైలి లేకపోవడం కూడా దీనికి కారణం. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇలా చేసి చూడండి చక్కని పరిష్కారం అందుకున్నట్టే..

ఈ జట్టురాలే సమస్యలను తగ్గించే అనేక ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిలో ఉండే రసాయనాలు కొన్నిసార్లు ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తాయి. అందుకే, ఇంటి చిట్కాలతో దీనికి పరిష్కారం కనుక్కోవచ్చు. ఇవి జుట్టును ఆరోగ్యంగా, ఒత్తుగా, నల్లగా మార్చడంలో సహాయపడతాయి. దీనితో పాటు, వాటి నుండి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండే ప్రమాదం కూడా చాలా తక్కువ. ఈ హోం రెమెడీ జుట్టును నల్లగా, మందంగా, పొడవుగా మార్చడంలో సహాయపడుతుంది. దీనిని వంటగదిలో ఉన్న వస్తువులతో తయారు చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఎర్రగా కనిపిస్తున్న ఈ చిన్న పండును వారానికి రెండు సార్లు తింటే చాలు.. బరువు తగ్గిపోవడం యమా ఈజీ..!

దీనికోసం...

అలోవెరా జెల్

కరివేపాకు

పెరుగు

కొబ్బరి నూనే

హెయిర్ టానిక్ ఎలా తయారు చేయాలి.

ఈ హెయిర్ టానిక్ చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో అలోవెరా జెల్ తీసుకోండి. ఇప్పుడు అందులో కరివేపాకు, పెరుగు, కొబ్బరి నూనె కలపాలి. దీని తర్వాత ఈ వస్తువులన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రసం తీసి స్టయినర్ సహాయంతో వేరు చేయండి. కాటన్ లేదా బ్రష్ సహాయంతో, జుట్టు మూలాలు, చివరలకు పట్టించండి. దాదాపు అరగంట తర్వాత జుట్టును కడిగి శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఈ హెయిర్ టానిక్‌లను ఉపయోగించండి. దీన్ని 7 సార్లు ఉపయోగించిన తర్వాత, జుట్టులో మందం, నలుపు రెండింటినీ చూస్తారు.

Updated Date - 2023-09-11T14:59:16+05:30 IST