Share News

Arjuna Bark: ఇదేం చెట్టు అని వింతగా చూస్తున్నారా..? దీని బెరడుతో కేన్సర్ వంటి రోగాలకు కూడా చెక్ పెట్టొచ్చని తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-11-14T14:39:40+05:30 IST

ఈ బెరడులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

Arjuna Bark: ఇదేం చెట్టు అని వింతగా చూస్తున్నారా..? దీని బెరడుతో కేన్సర్ వంటి రోగాలకు కూడా చెక్ పెట్టొచ్చని తెలిస్తే..!
Arjuna

ఆయుర్వేదం మన తరతరాల వైద్య చరిత్రను కాపాడుతూ వస్తుంది. ఆయుర్వేదంలో ముఖ్యంగా వాడబడే మందులన్నీ మొక్కల నుంచి సేకరించినవే ఎక్కువగా ఉంటాయి. అయితే ఆయుర్వేదంలో ముఖ్యంగా ప్రతి మొక్క, చెట్టు, వేరు, బెరుడు ఇలా ప్రతి దానికీ ఒక్కో వైద్యంలో, చికిత్సకు ప్రత్యేకంగా వాడుతూ ఉంటారు. వీటిలో కొన్ని మరీ ముఖ్యంగా వివరిస్తూ ఉంటారు. వీటిలో ముఖ్యంగా చెప్పే ఔషద వృక్షం అర్జున చెట్టు. దీని బెరడును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ బెరడులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. జలుబు, దగ్గు, వంటి ఇన్ఫెక్షన్లకు అర్జున బెరడు త్వరగా నయం చేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమెటరీ గుణాలు వాపును తగ్గించడంలో, ప్రధానంగా పనిచేస్తుంది.

గుండె ఆరోగ్యంలోనూ..

గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, సిరలు, ధమనుల్లో రక్త ప్రవాహం సాఫీగా సాగేందుకు, రక్తపోటుని నియత్రణలో ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

క్యాన్సర్..

పొగాకు, ధూమపానం అలవాటుతో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఈ కారణంగా క్యాన్సర్ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో రక్షణనిస్తుంది.

ఇది కూడా చదవండి: ఎంత తిన్నా.. అస్సలు లావు పెరగడం లేదా..? బక్కగా ఉన్నవాళ్లు ఈ 10 ఆహార తింటే..!


ఆ కషాయాన్ని తీసుకుంటే..

ఓ గ్లాసు అర్జున బెరడు కషాయాన్ని తాగడం వల్ల, రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్లు రాకుండా పనిచేస్తుంది. అధిక బరువును తగ్గించడంలో కూడా అర్జున బెరడు ప్రభావవంతంగా పనిచేస్తుంది.

గ్లాసు కషాయం తాగడానికి..

అర్జున బెరడు పొడిని ఒక స్పూన్ వరకూ రెండు గ్లాసుల నీటిలో కలిపి, మరిగించాలి. బాగా మరిగాకా, సగం వరకు మరిగించి, చల్లారాకా, వడగట్టి తాగాలి.

Updated Date - 2023-11-14T14:41:13+05:30 IST