jaggery benefits : పిరియడ్స్ నొప్పితో బాధపడేవారు చిన్న బెల్లం ముక్క తింటే చాలు.. బెల్లంతో ఇంకా ఎన్ని ప్రయోజనాలంటే..!!
ABN , Publish Date - Dec 27 , 2023 | 12:19 PM
ముఖ్యంగా చలికాలంలో జలుబు చేసి ఇబ్బంది పడుతున్నప్పుడు బెల్లం వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది. బెల్లం వేడి స్వభావం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
తీపి పదార్థాలను తయారు చేయాలంటే పంచదారనో, బెల్లాన్నో ఉపయోగిస్తాం. ఇందులో ముఖ్యంగా బెల్లంతో తయారు చేసే వంటకాలనే ఎక్కువగా తింటూ ఉంటాం. దీనికి ప్రధాన కారణం బెల్లం ఆరోగ్యానికి మంచి చేస్తుందని నమ్మడమే. ముఖ్యంగా ఆయుర్వేదం కూడా బెల్లాన్ని తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిదని చెప్పబడింది. బెల్లంలో కాల్షియం అధికంగా ఉండటం ఇది శరీర బలహీనతను తగ్గించడం వంటి ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఏదైనా తినాలనిపించినపుడు, పిల్లలకు తీపి పదార్థాలను పెట్టాలనుకున్నప్పుడు వంటింటి నుంచి తెచ్చే తీపి పదార్థం బెల్లమే అవుతుంది. బెల్లానికి మరో ముఖ్యమైన లక్షణం కూడా ఉంది బాగా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు బెల్లం ముక్కను బుగ్గన వేసుకుంటే ఇట్టే ఆగిపోతాయట.
మొలాసిస్ బెల్లం ఉపయోగాలు..
కడుపులో సమస్యలను ఎదుర్కోవడానికి బెల్లం చాలా సులభమైన ప్రయోజనకరమైన పరిష్కారం. గ్యాస్ పెరగడం, జీర్ణ సమస్యలు ఇలాంటి ఇబ్బందులు పోవాలంటే భోజనం తర్వాత బెల్లం తీసుకోవడం మంచిది. ఇది జీర్ణ క్రియకు సహకరిస్తుంది.
1. ముఖ్యంగా చలికాలంలో జలుబు చేసి ఇబ్బంది పడుతున్నప్పుడు బెల్లం వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది. బెల్లం వేడి స్వభావం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. బెల్లం పాలనుగానీ., టీని గానీ తీసుకోవాలి. దీనితో కషాయం అయినా తీసుకోవచ్చు.
2. బెల్లంతో పాటు అల్లాన్ని కూడా కలిపి గోరువెచ్చని నీటిలో మరిగించి టీలా చేసి ఇస్తే ఫలితం ఉంటుంది. కీళ్ళనొప్పులు, మంట నుంచి ఉపశమనం ఉంటుంది.
ఇది కూడా చదవండి: శీతాకాలంలో మార్నింగ్ వాక్ బద్దకంగా ఉందని స్కిప్ చేస్తున్నారా.. అయితే వైద్యులు ఏం చెబుతున్నారంటే..!
3. బెల్లంతో చర్మ ఆరోగ్యానికి కూడా నిగారింపు వస్తుంది. బెల్లం రక్తంలోని హానికరమైన టాక్సిన్లను తొలగిస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బెల్లం తినడంవల్ల మెటిమలు రాకుండా చర్మానికి మెరుపునిస్తూ., చర్మ సమస్యలను నివారిస్తుంది.
4. బెల్లాన్ని పిరియడ్స్ సమయంలో తీసకుంటే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఇది ప్రీమెన్ర్స్టల్ సిండ్రోమ్ సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు బెల్లంతీసుకోవడం మంచిది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.