Ayurvedic Tips: ఆరోగ్యానికి మంచిదంటూ పొద్దునే లేవగానే అందరూ చేసే మిస్టేక్ ఇదే.. ఆయుర్వేదంలో ఏముందంటే..!
ABN , First Publish Date - 2023-07-17T11:45:54+05:30 IST
జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.
ప్రతి ఒక్కరిలోనూ జీర్ణశక్తి ఉదయం చాలా బలహీనంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో కడుపులో అగ్ని నెమ్మదిగా ఉంటుందట, ఇలాంటి సమయంలో భారీ ఆహారాన్ని జీర్ణం చేయదు. అందుకే ఇటువంటి పానీయం ఉదయాన్నే త్రాగాలి, ఇది జీవక్రియను పెంచడంలో, ఇతర సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అదేమిటంటే..
చాలా మందిఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగుతారు. కొంతమంది నిమ్మరసం, జీలకర్ర నీరు, మెంతి నీరు, కొత్తిమీర నీరు, తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతుంటారు. వాతావరణం, ఆరోగ్యం కోసం అనుగుణంగా ఏదైనా తీసుకోవాలి, లేకుంటే శరీర ఆరోగ్యం విషయంలో హాని చేయడం ప్రారంభిస్తుంది.
ఉదయం పూట తీసుకోవల్సిన ఆయుర్వేద పానీయం..
జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. టాక్సిన్స్ తొలగిపోతాయి. మధుమేహం, బరువు తగ్గడం హార్మోన్ సమస్యలలో ఉన్నవారు మెంతి నీరు త్రాగాలి. వేసవిలో, శరదృతువులో శరీరం చల్లగా ఉండాలంటే దనియాల నీటిని తీసుకోవాలి.
ఈ పానీయాలను20 రోజులకు మించి తాగకూడదు. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల అవి శరీరం మీద మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యం విషయంలో ఎలాంటి బెంగా పడాల్సిన పని ఉండదు.
ఇది కూడా చదవండి: కష్టపడకుండానే కొవ్వు కరగాలంటే.. రోజూ పొద్దునే గ్లాసుడు నీళ్లల్లో ఈ గింజలను కలుపుకుని తాగితే..!
గోరువెచ్చని నీరు, నిమ్మకాయ
నిమ్మకాయ గోరువెచ్చని నీటితో త్రాగడం అందరికీ మంచిది కాదు. ఇది అసిడిటీ, అసమతుల్యత GERDకి కారణమవుతుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు, ప్రతి 40 రోజులకు ఈ పానీయంతో గ్యాప్ తీసుకుంటూ తీసుకోవాలి.
తేనె, గోరువెచ్చని నీరు
తేనెను గోరువెచ్చగా, వేడిగా దేనితోనూ తినకూడదు. ఇది తేనె లక్షణాలను నాశనం చేస్తుంది. అలాగే ఇది విషంగా మారుతుంది.
నెయ్యితో గోరువెచ్చని నీరు
వాత, పిత్త సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఆకలి, గ్యాస్ట్రిక్ సమస్యని పెంచుతుంది. అజీర్ణం సమస్య ఉన్నవారు దీనిని త్రాగకూడదు. ఉసిరికాయ జ్యూస్, బాటిల్ గోర్డ్ జ్యూస్, మొరింగ మొదలైనవి తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
పచ్చి కూరగాయలతో పానీయం..
పచ్చి కూరగాయలు ఖాళీ కడుపుతో తీసుకుంటే అవి సులభంగా జీర్ణం కావు. పిత్త, కాలేయ సమస్యలలో ఉన్నవారికి ప్రయోజనం ఉండవచ్చు కానీ.. దీనివల్ల కొందరిలో కడుపు ఉబ్బరం ఏర్పడవచ్చు. ఈ పానీయాలు ఎక్కువ కాలం తీసుకోకూడదు.