Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్‌తో 37 ఏళ్ల పైలెట్ మృతి.. డాక్టర్లు చెబుతున్న అసలు కారణాలు ఏంటంటే..!
ABN , First Publish Date - 2023-11-20T14:15:06+05:30 IST
గుండెకు సంబంధించిన చిన్న అనుమానం కలిగినా సరే వెంటనే స్క్రీనింగ్ చేయించుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు.
37 సంవత్సరాల హిమానీల్ కుమార్ పైలెట్ అతను హఠాత్తుగా గుండెపోటుతో మరిణించాడు. ఈ మధ్యకాలంలో చిన్నా, పెద్దా వయసు బేధం లేకుండా చాలావరకూ గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇలా గుండెకు సంబంధించిన చిన్న అనుమానం కలిగినా సరే వెంటనే స్క్రీనింగ్ చేయించుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు.
ఈమధ్య కాలంలో గుండెపోటు కారణంగా మరణాలు యువతలో సాధారణం అవుతున్నాయి. ఈ ప్రమాదం ఎప్పుడు ఏ విధంగా అటాక్ చేస్తుందనే విషయం తెలియడం లేదు. దేశం మొత్తం ఇదే ఆందోళన నడుస్తుంది. 37 ఏళ్ళ పైలెట్ కెప్టెన్ హిమానీల్ కుమార్ తన కార్యాలయంలో గుండెపోటుతో మరణించాడు. ఇలాంటి ప్రమాదాలు ఈ మధ్యకాలంలో కోకొల్లలు. దీని అంతటికీ జీవనశైలిలో మార్పులు, గుండె ఇబ్బందులు ఉన్నవారు స్క్రీనింగ్ చేయించుకోకపోవడం, ప్రధాన కారణాలు కావచ్చు.
యువతలో కార్డియాక్ అరెస్ట్ల్ వెనుక ఉన్న కారణాలపై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. గుండె ఆగిపోవడం వెనుక అనేక కారణాలు కూడా ఉన్నాయి. బాహ్య ఒత్తిడులన్నీ గుండె ఆరోగ్యంపై విపరీతమైన ఒత్తిడిని తీసుకువస్తాయి. ఇది నెమ్మదిగా కార్డియాక్ సమస్యలపై ప్రభావం చూపుతుంది.
CT యాంజియోగ్రఫీ, కాల్షియం స్కోరింగ్‌తో సహా సమగ్ర కార్డియాక్ స్క్రీనింగ్, కాల్షియం స్కోరింగ్‌తో అంతర్లీన ప్రమాద కారకాలను ముందుగానే గుర్తించి, పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. మధుమేహం, వయస్సు, రక్తపోటు స్థాయిలు, ధూమపానం, మద్యపానం వంటి కారణాల వల్ల కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: దానిమ్మ జ్యూస్‌ను అసలెందుకు తాగాలి..? ఈ 10 కారణాల లిస్ట్ చూస్తే..!
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పొత్తికడుపు, ఊబకాయం, పేలవమైన నిద్ర, గృహ వాతావరణం, ఒత్తిడి, చేసే పని, ఇవన్నీ గుండె రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పెరిగేందుకు దారితీస్తుంది. దీనికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, వ్యాయామాన్ని అనుసరించడం, వంటివి ఈ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కోవిడ్ మహమ్మరి తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్, ఇన్ప్లమేషన్ యువతలో రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన గుండెపోటుకు దారితీస్తుంది.