Share News

Black neck: శీతాకాలం మెడ భాగం నల్లగా మారిందా.. దీనికి కారణాలు, చికిత్సలు ఏంటంటే..!!

ABN , Publish Date - Dec 14 , 2023 | 01:04 PM

ఎండలో ఎక్కువగా చమటతో సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల, చర్మ సంరక్షణ నిర్లక్ష్యం చేయడం వల్ల మెడ నలుపుదనం మొదలవుతుంది.

Black neck: శీతాకాలం మెడ భాగం నల్లగా మారిందా.. దీనికి కారణాలు, చికిత్సలు ఏంటంటే..!!
neck

చలికాలం శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా చర్మం విషయానికి వచ్చేసరికి, ఈ కాలంలో చర్మం పొడిబారి కనిపిస్తుంది. కాళ్ల చర్మం పగిలి కనిపిస్తుంది. అలాగే చేతులు, పెదవుల విషయంలోనూ చర్మం చిట్లి కనిపిస్తుంది. ముఖ చర్మం విషయానికి వస్తే ముఖం మొత్తం గట్టిగా మారినట్టు బిగుసుకుంటుంది. ఇది వాతావరణంలో పెరిగిన చలి కారణంగా కావచ్చు. అయితే మెడ భాగంలో చాలా మందికి సరిగ్గా ఈ కాలంలలోనే నలుపుదనం కనిపిస్తుంది. దీనికి చాలా కారణాలున్నాయి. మెడ భాగంలో నలుపుదనం కనిపించగానే కంగారు పడకుండా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. దీనికి వెనుక కారణాలు, చికిత్సలు ఏంటంటే..

మెడ నలుపుకు కారణాలు..

ఎండలో ఎక్కువగా చమటతో సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల, చర్మ సంరక్షణ నిర్లక్ష్యం చేయడం వల్ల మెడ నలుపుదనం మొదలవుతుంది. అలాగే కొన్ని మందుల దుష్ర్ఫభావం కావచ్చు. ప్రీ డయాబెటిక్ సంకేతాల వల్ల కూడా మెడ నలుపుదనం కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ ఐదు పదార్థాలను తీసుకుంటే చాలు.. శీతాకాలంలో వచ్చే అలెర్జీల నుంచి బయటపడ్డట్టే..!


మెడ నలుపుకు చికిత్సలు..

మంచి ప్రభావం ఉన్న ఫేస్ వాష్ ని ఉపయోగించడం ముఖ్యం. అలాగే కోల్ట్ ప్రెస్ డ్ సబ్బుతో పిగ్మెంటేషన్ తో మెడ భాగాన్ని క్లీన్ చేసుకోవడం ముఖ్యం. వాడే ఫేస్ వాష్ మీ చర్మం పొడి బారకుండా చూసుకోవాలి.

మర్దనా.. లేదా ఎక్స్ ఫోలియేట్ చేయండి..

చర్మం మృత కణాలను క్రమం తప్పకుండా తొలగించడం వల్ల చర్మం నలుపుదనం పోతుంది. అలాగే పాలతో తయారుచేసిన స్రబ్బర్‌ని వాడటం కూడా మంచిదే.. దీనితోపాటు శెనగపిండి, పెరుగుని వాడటం వల్ల మెడకు చుట్టూ ఉన్న డార్క్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. స్ర్కబ్ చేయడం వల్ల ఉపశమనం ఉంటుంది.

Updated Date - Dec 14 , 2023 | 01:04 PM