Coconut water: కొబ్బరి నీళ్ళు తాగడానికి సరైన సమయం కావాలా..?
ABN , First Publish Date - 2023-11-18T16:57:07+05:30 IST
కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారు, గుండె రిథమ్ డిజార్డర్ ఉన్నవారు ఈ నీటిని తీసుకోకూడదు.
ఆరోగ్యం కాస్త తేడాగా ఉన్నా, జ్వరం, నీరసంలాంటి పరిస్థితుల్లో వెంటనే శక్తిని ఇచ్చే సహజమైన నీరు కొబ్బరి నీరునే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. కొబ్బరినీళ్ళు తీసుకుంటే తక్షణమే శక్తి వస్తుందని నమ్ముతాం. అలాగే ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగడం వల్ల నీరసమే కాదు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుందట. చర్మ హైడ్రేషన్ విషయంలోనూ చర్మ నిగారింపుకు కారణం అవుతుంది.
కొబ్బరి నీళ్ళలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. డ్రింక్ తాగాలనిపించినా,. లేదా సోడాలాంటివి తాగాలనిపించిన ప్రతిసారీ కొబ్బరినీరుకు మారి చూడండి. ఇది ఇతర పానీయాలకంటే 45 కేలరీలతో ఉంటుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. ఇన్ని గుణాలున్న కొబ్బరి నీటిని ఏ సమయంలో తీసుకోవాలి అనే విషయంలో మాత్రం చాలా అనుమానాలే ఉన్నాయి. అసలు ఎప్పుడు తీసుకోవాలంటే..
అనారోగ్యాలు, డిహైడ్రేషన్ వంటి సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే తీసుకోవడం మంచిది. అలాగే తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది. సాయంత్రం కాకుండా ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల వ్యాయామం తర్వాత తీసుకుంటే అది రీహైడ్రేషన్ కు కారణం అవుతుంది.
రక్తంలో పొటాషియం ఎక్కవగా ఉంటే కనుక కొబ్బరి నీరు తాగకూడదు. కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారు, గుండె రిథమ్ డిజార్డర్ ఉన్నవారు ఈ నీటిని తీసుకోకూడదు. గర్భిణీ స్త్రీలు మలబద్దకం, జీర్ణకోశంలో తేడాలు ఉన్నవారు కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
ఇది కూడా చదవండి: చలికాలంలో బచ్చలి కూర తినడం మంచిదేనా.. దీనితో కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే..!
బిడ్డలకు పాలిచ్చే తల్లులు కొబ్బరి నీళ్ళను తీసుకుంటూ ఉంటే బిడ్డ ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి నీరు తల్లి పాలలో లారిక్ యాసిడ్ ను పెంచుతుంది. దీనిలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలున్నాయి. శృంగార శక్తిని పెంచడంలో కొబ్బరి నీరు ఎంతగానో సహకరిస్తుంది. కిడ్నీలో రాళ్ళు కరిగిపోవడానికి కూడా కొబ్బరి నీరు సహకరిస్తుంది.