Health Tips: కాఫీ తాగడానికి అసలు కరెక్ట్ టైమ్ ఏంటి..? ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిదంటే..!
ABN , First Publish Date - 2023-12-02T13:38:49+05:30 IST
ఉదయం, సాయంత్రం, అలాగే నిద్రకు ముందు కాఫీతాగడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతవరకూ సపోర్ట్‌గా నిలుస్తుంది.
ఉదయం కాగానే వేడి వేడి కాఫీతో ప్రారంభించేవారు చాలామందే ఉంటారు. అసలు కాఫీ, టీలు ఉదయాన్నే ఎందుకు తీసుకోవాలని అనుకుంటారు. ఇందులోని కెఫిన్ జీవక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అయితే తాగడానికి సరైన సమయం ఏది..అనేది తెలుసుకుందాం.
కాఫీ తాగడానికి ఇష్టపడేవారు, ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిది..
ఉదయం, సాయంత్రం, అలాగే నిద్రకు ముందు కాఫఈతాగడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతవరకూ సపోర్ట్‌గా నిలుస్తుంది. కాఫీని తీసుకునే సమయం సరిగా లేకపోతే అది నిద్రలేమికి, గుండె జబ్బులకు, క్యాన్సర్, హార్మోన్ల సమస్యలు మొదలవుతాయి. ఇందులోని కార్టిసాల్ శరీరంలో ఒత్తిడిని పెంచుతుంది. అందేకాకుండా ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఛాతీలో మంట, నిద్రలేని సమస్యలు తలెత్తుతాయి. అలాగే తినే ముందు కాఫీ తాగడం కూడా శరీరానికి హాని చేస్తుంది.
కాఫీ ని ఎక్కువగా తీసుకుంటే..
1. హై బీపీ సమస్య ఉన్నవారు కాఫీ తాగితే మరింతగా పెరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
2. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి కాఫీ అవసరం అనుకుంటాం కానీ.. దీనితో జీర్ణ శక్తి చెడిపోతుంది. మలబద్దకం సమస్య, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువాగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: కొబ్బరి కాయను సరిగ్గా సగానికి పగలగొట్టేందుకు అదిరిపోయే టెక్నిక్.. లోపల ఉన్న కొబ్బరిని కూడా ఈజీగా తీయాలంటే..!
3. కాఫీ ఎక్కువగా తీసుకుంటే ఎముకలపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా కీళ్ళలో నొప్పులు ఉంటాయి.
4. తరచుగా నిద్ర సమస్యలతో బాధపడుతుంటే, కాఫీ తాగకూడదు. ఇందులో ఉండే కెఫిన్ నిద్రను ప్రభావితం చేస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.