Dates: ఖర్జూర పండ్లను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కడిగేసి తినేస్తున్నారా..? ఈ ఒక్క నిజం కనుక తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-11-21T13:38:36+05:30 IST
ఖర్జూరాలు సాధారణంగా రాత్రిపూట అంతా నానడం అంటే అవి కాస్త మృదువుగా మారేందుకు సహకరిస్తాయి. ఖర్జూరాల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
ఖర్జూరం ఇది చెట్టు నుంచి వచ్చే ముడతలు పడిన రూపంతో తియ్యగా జిగట రుచితో ఉంటుంది. ఖర్జూరాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పండిస్తారు. ఇది చాలామందికి ఇష్టమైన ఆహారం. నానబెట్టిన ఖర్జూరాలు సాధారణంగా రాత్రిపూట అంతా నానడం అంటే అవి కాస్త మృదువుగా మారేందుకు సహకరిస్తాయి. ఖర్జూరాల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందుతాయి అవేమిటంటే..
నానబెట్టిన ఖర్జూరం మన ఆరోగ్యాన్ని పెంచే 10 మార్గాలు,.
1. నానబెట్టిన ఖర్జూరాలు డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. మెరుగైన పేగు ఆరోగ్యాన్ని అందిస్తుంది.
2. ఖర్జూరాలు చక్కెర, కార్బోహైడ్రేట్ల సహజ మూలం. వాటిని శక్తిని పెంచే ఒక ఆదర్శవంతమైన చిరుతిండి, వర్కౌట్ ముందు ఆహారంగా తీసుకోవచ్చు.
3. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలుంటాయి. ఇవి ఎముక బలానికి సహకరిస్తాయి.
4. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో ముందుంటాయి.
5. మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
ఇది కూడా చదవండి: మగాళ్లలో కొందరి రొమ్ములు.. స్త్రీల స్థనాల్లా ఉండటం వెనుక అసలు కారణం ఇదన్నమాట..!
6. ఎక్కువ ఫైబర్ కంటెంట్ వల్ల నానిన ఖర్జూరాలు జీర్ణక్రియలో సహాయపడతాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి.
7. తక్కువ గ్లైసెమిక్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
8. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి, ఎ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు అవసరమైనవి. ఇవి అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహకరిస్తాయి.
9. హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందులోని పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును తగ్గించడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
10. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నానబెట్టిన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.