Apple: యాపిల్స్ అంటే యమా ఇష్టమా..? అసలు ఏ టైమ్‌లో తినకూడదో ముందే తెలుసుకోండి..!
ABN , First Publish Date - 2023-09-21T11:25:41+05:30 IST
యాపిల్‌లో ఉండే యాసిడ్ ఆహారం జీర్ణక్రియను మందగించి అజీర్తిని కలిగిస్తుంది.
ఇవే మన ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తాయనే అభిప్రాయంలో ఉండి చాలా వరకూ ఆ పదార్థాన్నే తింటూ ఉంటాం. అయితే మనం తీసుకునే ఆహారాలన్నీ ఆరోగ్యాన్ని అందించడం అలా ఉంచితే తినే సమయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లలో యాపిల్ విషయానికి వస్తే.. రోజుకు ఒకయాపిల్ తినడం వల్ల డాక్టర్ దగ్గరకు వెళ్ళే పని ఉండదనేది అంతా చెప్పే మాట. దీని విషయంలో ఆరోగ్యానికి ఢోకా లేదు కానీ యాపిల్ తీసుకునే విషయంలోనే కాస్త పట్టింపులు ఉన్నాయి. యాపిల్ లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, వివిధ రకాలైన ఖనిజాలు యాపిల్‌లో ఉంటాయి, ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే రోజులో కొన్ని సార్లు యాపిల్ తినకూడదట. ఇలా దానిని తింటే హాని కలిగిస్తుంది. రోజు మొత్తంలో ఏయే సమయాల్లో యాపిల్ తినకూడదో తెలుసుకుందాం.
రాత్రి పడుకునే ముందు యాపిల్ తినడం
కడుపు భారంగా మారుతుంది. నిద్రను పాడుచేయవచ్చు. యాపిల్‌లో చక్కెర, ఫ్రక్టోజ్‌లు ఉంటాయి, ఇది శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. దీనివల్ల నిద్రపట్టడంలో ఇబ్బంది కలుగుతుంది. యాపిల్‌లో అధిక ఫైబర్ ఉంటుంది. రాత్రిపూట ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. వేడి పాలతో యాపిల్ తినడం వల్ల నిద్రను పాడుచేసే అవకాశం ఉంది. యాపిల్ అసిడిటీని కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: కలలో డబ్బు కనిపించిందా..? నోట్లను లెక్కిస్తున్నట్టు కల వస్తే దాని అర్థమేంటంటే..
ఆహారం తిన్న వెంటనే యాపిల్ తినడం
జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. యాపిల్‌లో అధిక మొత్తంలో ఫ్రక్టోజ్, చక్కెర ఉంటుంది. భోజనం చేసిన వెంటనే దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. యాపిల్‌లో ఉండే యాసిడ్ ఆహారం జీర్ణక్రియను మందగించి అజీర్తిని కలిగిస్తుంది. అందువల్ల, ఆహారం తిన్న తర్వాత కనీసం 1 నుంచి 2 గంటల తర్వాత ఆపిల్ తినాలి. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.
సాయంత్రం ఆపిల్ తినడం
రాత్రిపూట కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. సాయంత్రం పూట ఆపిల్‌లో ఉండే చక్కెర , ఫ్రక్టోజ్ నిద్రను పాడు చేస్తుంది. సాయంత్రం పూట ఆపిల్ తినడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి రావచ్చు.