Share News

Chapathi: చపాతీలు చేసే వాళ్లలో 90 శాతం మందికి ఈ విషయం తెలిసి ఉండదు.. అందరూ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-11-29T17:19:07+05:30 IST

పెద్ద పాత్రలో నీటిలో పదినిమిషాలు నానబెట్టి, రుద్ది కడగాలి. దీనికోసం స్టీల్ స్రబ్బర్‌ను ఉపయోగించకూడదు.

Chapathi: చపాతీలు చేసే వాళ్లలో 90 శాతం మందికి ఈ విషయం తెలిసి ఉండదు.. అందరూ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే..!
Clean the rolling pin

ఉదయాన్నే అల్పాహారంగా తీసుకునే ఆహారం తయారయ్యేది వంటగదిలోనే, అందుకే వంటగది చాలా శుభ్రంగా ఉండాలి. శక్తిని ఇచ్చే ప్రతి వంటకానికి శుభ్రత చాలా అవసరం. అయితే రోటీల విషయంలో చుట్టడానికి చెక్క రోలింగ్ పిన్ ని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే దీని శుభ్రత విషయంలో మాత్రం కాస్త నిర్లష్యంగా ఉంటాం. ఇదే చాలా రోగాలకు కారణం కావచ్చు. అలాగే శుభ్రం చేయడానికి కూడా సరైన పద్దతులు వారికి తెలియవు. దీనికి ఏం చేయాలంటే..

రోలింగ్ పిన్ ఎప్పుడు శుభ్రం చేయాలి...

రోలింగ్ పిన్ ను బ్యాక్టీరియా మొత్తం పేరుకుందని గుర్తించాలి. తడి పిండి చపాతీలు చేస్తున్నప్పుడు తేమ కారణంగా ఫంగస్, బ్యాక్టీరియా పేరుకుంటుంది. దీనిని శుభ్రం చేయకపోతే అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది.

దీనిని శుభ్రం చేయాలంటే..

పెద్ద పాత్రలో నీటిలో పదినిమిషాలు నానబెట్టి, రుద్ది కడగాలి. దీనికోసం స్టీల్ స్రబ్బర్ ను ఉపయోగించకూడదు.

ఇది కూడా చదవండి: దగ్గు, జలుబు వంటివి చలికాలంలో అస్సలు రాకుండా ఉండాలంటే.. ఈ చిన్న పని చేయండి చాలు..!


రోలింగ్ పిన్ కడగడం..

రోలింగ్ పిన్ క్లీన్ చేయడానికి నెలలో ఒకసారి శానిటైజ్ చేయాలి. దీనితో బ్యాక్టీరియా పెరుగుతుంటే మాత్రం ఎప్పటికప్పుడు వదిలించుకోవాలి. వేడినీటిలో వెనిగర్ మిశ్రమం వేసి పదినిమిషాలుస ఉంచి కడిగి ఎండలో ఉంచాలి.

ఈ తప్పు చేయద్దు..

రోలింగ్ పిన్ చపాతీలు చేసాకా శుభ్రం చేస్తే దానిని తప్పకుండా ఎండలో ఆరనివ్వాలి. లేదంటే బ్యాక్టీరియా మళ్ళీ తిరిగి వస్తుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-29T17:19:10+05:30 IST