7 Habits: మగాళ్లయినా, స్త్రీలయినా సరే.. ఈ 7 అలవాట్లు ఉంటే 30 ఏళ్లు దాటగానే ముసలి వాళ్లుగా కనిపించడం ఖాయం..!
ABN , First Publish Date - 2023-09-02T11:29:34+05:30 IST
30 తర్వాత మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇదే.
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆకర్షణీయంగా కనిపించాలి అనుకుంటారు. వృద్ధాప్య లక్షణాలు రాకుండా, వయసు పెరిగినా పైకి కనిపించకుండా ఉండాలని తాపత్రయపడేవాళ్ళూ లేకపోలేదు. 40 ఏళ్ళు దగ్గరపడుతున్నా ముఖంలో ఆ ఛాయలు కనిపించకుండా ఉండాలని కోరుకుంటూనే ఉంటారు.
20 ఏళ్లు ఉన్నట్లుగా కనిపించాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి, అవి 30 ఏళ్ల తర్వాత మరింత వేగవంతం కావడం ప్రారంభిస్తాయి. చెడు అలవాట్ల వల్ల కూడా కొన్ని ముందస్తు వృద్ధాప్య లక్షణాలు వస్తాయి. అలాగే మన మానసిక స్థితి కూడా ఇందుకు కారణం కావచ్చు. వయస్సు పెరిగే కొద్దీ మరింత యవ్వనంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే, ఈరోజు నుండే అలవాట్లలో కొన్నింటిని మార్చుకోవాలి.
1. ప్రపంచం నుండి వేరుగా
చాలామంది తరచుగా నాలుగు గోడలలో బంధిలైపోతారు, ఈ ధోరణి సరైనది కాదు. సామాజిక వృత్తాన్ని పెంచుకోవడం, స్నేహితుల్ని, బంధువులను కలవడం వల్ల, సామాజిక వృత్తం పెరుగుతుంది. మానసికంగా, శారీరకంగా కూడా అనుభూతి చెందేలా చేస్తుంది.
2. బాధ్యతల భారం
30 ఏళ్లు వచ్చే సరికి బాధ్యతల్లో కూరుకుపోయి మంచి అలవాట్లపై తక్కువ శ్రద్ధ చూపుతారు. సంతోషాన్ని కలిగించే విషయాలను వదిలేస్తూ.. బాధ్యతలను నిర్వహించే పనిలో బిజీ బిజీ లైఫ్ గడిపేస్తూ ఉంటారు.
3. అనవసరంగా ఖర్చు చేయడం..
అవసరాలను తీర్చుకోవడానికి డబ్బు చాలా ముఖ్యం. 30 ఏళ్ల తర్వాత, ఆర్థిక పరిస్థితిపై సీరియస్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. డబ్బు ఆదా చేసుకోవాలి. భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలి. దీంతో జీవితాంతం ఎలాంటి ఒత్తిడి ఉండదు.
4. జీవితంలో కొత్తగా ప్రయత్నించకపోవడం..
జీవితంలో కొత్తగా సాహసిస్తూ ఉండాలి. కొత్త విషయాలను తెలుసుకుంటూ, నేర్చుకుంటూ కాలాన్ని గడిపేయాలి. ఇది మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా కొత్త విషయాలను కూడా నేర్చుకునేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి: అచ్చం అల్లమే, కానీ రుచికి వస్తే మాత్రం నషాళానికి అంటుతుంది. ఎండిన అల్లం అదే శొంఠితో ఎలాంటి ఉపయోగాలంటే..!
5. ఏళ్ల తరబడి అదే పని..
ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉండాలి. 30 ఏళ్ల వరకు ఒకే ఉద్యోగంలో పని చేస్తున్నప్పుడు ఆందోళన చెందుతారు. ఒత్తిడి కారణంగా వారి మానసిక, శారీరక ఆరోగ్యం క్షీణిస్తుంది.
6. అనారోగ్య జీవనశైలి
30 సంవత్సరాల వయస్సు వరకు, స్వంత మార్గంలో జీవితాన్ని గడుపుతారు, కానీ ఇది వృద్ధాప్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 30 తర్వాత మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇదే..
7. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు
మద్యం, ధూమపానానికి బానిసలైతే ఈ అలవాటును మానుకోవడం మంచిది. అతిగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం కూడా చెడు అలవాటు కిందకే వస్తుంది. వీటన్నింటిని కాస్త దూరం జరపగలిగితే వృద్ధాప్యాన్ని మెరుగుపరుచుకున్నట్లే..