Share News

Fenugreek water: మెంతి నీటిని రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్ని లాభాలా..!! ఓసారి ట్రై చేసి చూడండి.

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:26 PM

మెంతినీరు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

Fenugreek water: మెంతి నీటిని రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్ని లాభాలా..!! ఓసారి ట్రై చేసి చూడండి.
Benefits of consuming fenugreek water

భారతీయ వంట గదుల్లో చాలా పెద్ద స్థానాన్నే సంపాదించుకున్న మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజలు కొంచెం చేదు రుచిని కలిగి ఉండి భారతీయ వంటకాలకు ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. మెంతి గింజలను నీటిలో నానబెట్టి తీసిన నీరు కూడా అరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

సాధారణంగా ఈ మెంతి గింజల్లో అనేక పోషకాలున్నాయి. ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ సహా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను పెంచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ , మంటను తగ్గించడంలోనూ సహకరిస్తుంది.

1. మెరుగైన జీర్ణక్రియ

మెంతి నీరు అజీర్ణం, ఉబ్బరం, మలబద్దకం, జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో అధిక ఫైబర్ కంటెంట్ ఉంది.

2. బరువు తగ్గడంలోనూ, ఆకలిని తగ్గించడంలోనూ మెంతి నీరు సహకరిస్తుంది. కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా తగ్గిస్తుంది.

3. కొలస్ట్రాల్ స్థాయిను తగ్గిస్తుంది.

మెంతినీరు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

ఇది కూాడా చదవండి: ఈ ఐదు పదార్థాలను తీసుకుంటే చాలు.. శీతాకాలంలో వచ్చే అలెర్జీల నుంచి బయటపడ్డట్టే..!


4. రక్తంలో చక్కెర స్థాయిలు

మెంతి నీరుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరల స్థాయిలను నియంత్రించవచ్చు.

5. మెంతి నీళ్ళలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉండే కాంపౌండ్స్ ఉంటాయి. ఆర్థరైటిస్, ఆస్తమా వంటి జబ్బులను తగ్గించడంలో సహకరిస్తుంది.

మెంతి నీరులో ఫైటోఈస్ట్రోజెన్ కంటెంట్ పుష్కలంగా ఉంది. ఇది హార్లోన్ల అసమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెంతి నీరు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొటిమలను తగ్గించవచ్చు, అలాగే చర్మం కూడా ఆరోగ్యంగా మెరుస్తుంది. సహజమైన మెరుపును అందిస్తుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 18 , 2023 | 12:26 PM