Raw Banana Benefits: ఎవరూ పట్టించుకోరు కానీ.. మార్కెట్‌లో కనిపించే ఈ పచ్చి అరటిపండ్లతో ఎంత లాభమో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-12-02T14:46:54+05:30 IST
ఇది చాలా రకాల ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని కూడా బలపడుతుంది.
ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేసే పండ్లలో అరటిపండు ఒకటి. ఇందులో అనేక పోషకాలున్నాయి. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పండిన అరటిపండులో కూడా చాలా ప్రయోజనాలున్నాయి. ఈ పండ్లను బాగా పండిని పసుపు రంగులోకి మారాకా అరటి పండును ఆరోగ్యానికి, జీర్ణ క్రియకు చాలా సహకరిస్తుంది. ఇందులోని పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం పిల్లలు, పెద్దలకు ఇద్దరికీ మంచిదే. అయితే పచ్చి అరటి కాయల్లో కూడా చాలా ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే..
పచ్చి అరటిపండ్లు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ విషయం మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది జీర్ణం కావడం కూడా సులభం. ఇది ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. ఇందులో ఫైబర్, పొటాషియం, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి అరటిపండు బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. ఇందులోని రెసిస్టెంట్ స్టార్చ్, పెక్టిన్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. అతిగా తినేవారికి ఆకలిని తగ్గించేందుకు చక్కని ఎంపిక.
గుండెకు సపోర్ట్..
బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి పచ్చి అరటిపండు సహకరిస్తుంది. ఇందులో అనేక గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలున్నాయి. పచ్చి అరటి సహజ వాసోడైలేటర్లను కలిగి ఉంటుంది. రక్తపోటును తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: కాఫీ తాగడానికి అసలు కరెక్ట్ టైమ్ ఏంటి..? ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిదంటే..!
విటమిన్ సి..
ఆకుపచ్చ అరటిపండులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది చాలా రకాల ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని కూడా బలపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
రక్తంలో చక్కెర స్థాయి..
పండిన అరటిలో అరటిపండులో చక్కెర స్థాయిలు తక్కవగా ఉంటాయి. ఆకుపచ్చ అరటిపండులో ఉండే పెక్టిన్, రెసిస్టెంట్ స్టార్ట్ రక్తంలో చక్కెర స్థాయిని ముఖ్యమైనవి.
వాపును తగ్గిస్తుంది.
పచ్చి అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. శరీరాన్ని ఆక్సీకరణ నష్టం నుండి ఆరోగ్యకరమైన కణాలను రక్షించడం వరకూ అరటిపండు సహకరిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.