Share News

Men vs Women: మహిళల కంటే మగాళ్లే ఎందుకు త్వరగా చనిపోతారంటే..!

ABN , First Publish Date - 2023-11-20T16:49:52+05:30 IST

రగ్బీ, బాక్సింగ్, కార్ రేస్, మోటార్ సైకిల్ రేసింగ్ ఇలా చాలా క్రీడలు ఒత్తిడితో జరిగేవే. ఇవి వైకల్యానికి, అకాల మరణానికి కూడా దారితీస్తున్నాయి.

Men vs Women: మహిళల కంటే మగాళ్లే ఎందుకు త్వరగా చనిపోతారంటే..!
men and women

స్త్రీ, పురుషుల జీవనశైలిలోనూ, జీవన కాలపు అంచనాలో వ్యత్యాసం ఉంది. ఇది మగ, ఆడ జంతువుల మధ్య కూడా ఈ తేడా మనకు కనిపిస్తుంది. పురుషులతో పోల్చితే స్త్రీ వారిని మించి జీవిస్తారట. దీనికి వైద్యులు చెబుతున్నమాట ఏంటంటే.. మామూలుగా అయితే పురుషుల్లో మామూలుగా కనిపించే లక్షణంలో ఒకటి వారి జీవిత కాలంలో పురుషులు వైద్యుడిని సంప్రదించడం అనేది తక్కువే ఉంటుందట. మరీ అనారోగ్య సమస్యలు వస్తేనే తప్పితే వారికి డాక్టర్స్‌తో పెద్దగా పని ఉండదు. ఇక ఈ విషయంలో ఆడవారు అలాకాదు.. వివాహం అయిన దగ్గరి నుంచే స్త్రీకి వైద్యుల సలహాలు తప్పనిసరి.

2017 నుంచి 2019 వరకూ ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. ఆస్ట్రేలియాలో మగవారి ఆయుర్దాయం 80.9గా ఉంటే ఆడవారిది 85.5 గా ఉంది. ఇది 4.1 సంవత్సరాల గ్యాప్. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎక్కువగా ఒత్తిడి, నిరాశ, ఆందోళన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అత్యంత అసమానతలు ఉన్న దేశాల్లో కూడా పురుషులకన్నా ఎక్కువగా జీవిస్తున్నారు.

మహిళల కంటే మగాళ్లే ఎందుకు త్వరగా చనిపోతారంటే..

హార్మోన్ల వ్యత్యాసాలు పురుషులను రిస్క్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. పురుషుల్లో ఎక్కువ ప్రమాదకర వృత్తులను ఎంచుకోవడం, సైనిక పోరాటం, ఆయుల్ రిగ్లు, పోలీస్ వర్క్, ఫైర్ ఫైటింగ్ వంటి అధిక రిస్క్ టాస్క్‌లలో మహిళల కంటే ఎక్కువ సంఖ్యలో ఒత్తిడి ఉంటుంది. ఇది అనేక అనారోగ్య జీవనశైలి ఒత్తిడి, అనారోగ్య జీవనశైలికి కారణం అవుతుంది.

ప్రమాదకరమైన క్రీడలు,

మహిళలకంటే ఎక్కువ పురుషులు గణనీయమైన తేడాతో మహిళలకంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రగ్బీ, బాక్సింగ్, కార్ రేస్, మోటార్ సైకిల్ రేసింగ్ ఇలా చాలా క్రీడలు ఒత్తిడితో జరిగేవే. ఇవి వైకల్యానికి, అకాల మరణానికి కూడా దారితీస్తున్నాయి.

ఇది కూడా చదవండి: కార్డియాక్ అరెస్ట్‌తో 37 ఏళ్ల పైలెట్ మృతి.. డాక్టర్లు చెబుతున్న అసలు కారణాలు ఏంటంటే..!


వ్యాధి

ఇక కొన్ని దేశాల్లో అయితే మగవారిలో కార్డియోవాస్కులర్ వ్యాధి ప్రధానంగా ఉంది. గుండె, స్ట్రోక్, వాస్కులర్ డిసీజ్, ప్రాబల్యం స్త్రీలలో పోల్చితే పురుషులలో ఎక్కువగా ఉంటుందని తేలింది. సెక్స్ విషయంలో హార్మోన్ టెస్టోస్టెరాన్ పురుషులలలో ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉండేందుకు కారణం కావచ్చు.

వీటితో పాటు అనారోగ్యాలను పెంచే అలవాట్లు కూడా కారణం అవుతున్నాయి. ధూమపానం, మధ్యపానం, ఎక్కువ స్త్రీలతో సంబంధం కలిగి ఉండటం ఎక్కువ వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయట. మహిళల కంటే పురుషుల ఆత్మహత్యల రేటు మూడు రెట్లు ఎక్కువ ఉందట.. ఇవన్నీ స్త్రీల కన్నా పురుషులు త్వరగా చనిపోవడానికి కొన్ని కారణాలు.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-20T17:40:17+05:30 IST