Pimples: ముఖంపై మొటిమలు వస్తున్నాయి కదా అని వాటినీ.. వీటినీ వాడకండి.. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూస్తే..!
ABN , First Publish Date - 2023-10-09T15:56:30+05:30 IST
ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి, ముందుగా 1/4 టీస్పూన్ యాపిల్ వెనిగర్ తీసుకుని, దానికి 3/4 టీస్పూన్ నీరు వేసి పేస్ట్ చేయాలి.
ముఖం మీద చిన్న మచ్చ వచ్చినా, అందవికారంగా కనిపిస్తారు. ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం, మచ్చలు లేని చర్మం కావాలనే కోరుకుంటారు. కాకాపోతే పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రతి ఒక్కరి చర్మం చికాకుగా, జిడ్డుగా కనిపిస్తుంది. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్స్ అంటే ముఖం జిడ్డుగా పెట్టుకుని వెళ్ళలేం. ఇలాంటి సమస్యలతో ఆత్మనూన్యతాభావం మరింత పెరుగుతుంది. ఇక మొటిమలు ముఖంమీద గుర్తులు అన్నీ మాయం అవ్వాలంటే.. ఇలా చేసి చూడండి.
మొటిమలను తొలగించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వెనిగర్‌లో ఉన్నాయి, ఇవి మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీని వల్ల ముఖంలో మొటిమలు రావు. ముఖంపై ఇప్పటికే ఏదైనా గుర్తు ఉంటే, అది కూడా పోతుంది.
మొటిమలను తొలగించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఎలా అప్లై చేయాలి. మొటిమలను తొలగించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఎలా అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి, ముందుగా 1/4 టీస్పూన్ యాపిల్ వెనిగర్ తీసుకుని, దానికి 3/4 టీస్పూన్ నీరు వేసి పేస్ట్ చేయాలి. దీని తర్వాత, ముఖాన్ని ఫేస్ వాష్‌తో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మొటిమలపై రాయండి.
ఇది కూడా చదవండి: రోజూ రాత్రిళ్లు పడుకునేముందు దీన్ని ముఖానికి రాసుకుని పడుకుంటే.. వయసు పెరుగుతున్నా..!
ఈ మిశ్రమాన్ని మొటిమల మీద 5 నుండి 10 సెకన్ల పాటు ఉంచి, ఆపై నీటితో కడగాలి. కావాలంటే, రోజుకు 2 నుండి 3 సార్లు దీనిని ముఖానికి పూయవచ్చు. దీనిని మొటిమలతో ఇబ్బంది పడుతున్న స్త్రీలు, పురుషులు, పిల్లలుప్రభావవంతంగా పనిచేస్తుంది.