Red Light Therapy: ఏంటీ ఈ రెడ్ లైట్ థెరపీ.. 50 ఏళ్లొచ్చినా కూడా 35 ఏళ్ల వయసున్న వ్యక్తిలాగానే కనిపించాలంటే..!

ABN , First Publish Date - 2023-10-01T12:32:45+05:30 IST

ఈ థెరపీ హెయిర్ ఫోలికల్స్ లోని ఎపిడెర్మల్ స్టెమ్ సెల్స్ ను ఉత్తేజ పరిచి, జుట్టు తిరిగి వచ్చే విధంగా ప్రోత్సహిస్తుంది.

Red Light Therapy: ఏంటీ ఈ రెడ్ లైట్ థెరపీ.. 50 ఏళ్లొచ్చినా కూడా 35 ఏళ్ల వయసున్న వ్యక్తిలాగానే కనిపించాలంటే..!
skin

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో వస్తున్న మార్పులు చాలా బాధ కలిగిస్తాయి. వయసు పెరుగుతున్న విషయాన్ని ఈ మార్పులే బయటివారికి తెలిసేలా చేస్తాయి. అయితే ముఖ్యంగా ముఖంలో వచ్చే మార్పు మరీ స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పేస్తుంది. ముఖం కాంతి తగ్గడం, నిగారింపును కోల్పోవడంతో పాటు ముడతలు కూడా ఏర్పడి వృద్ధాప్యం ఛాయలను కొట్టొచ్చినట్టు కనిపించేలా చేస్తుంది.

50 ఏళ్ళు వస్తున్నాయంటే కనిపించే మార్పుకు సిద్ధం కావాల్సిన అవసరంలేదు. వయసును తగ్గించుకునే విధంగా థెరపీలు ఎన్నో అందుబాటులోకి వచ్చేసాయి. ఈ ఆరు ప్రయోజనాలతో ఈ విషయాన్ని తెలుసుకోండి. అసలు రెడ్ లైట్ థెరపీ పెరుగుతున్న వయసును ఎలా దాచేస్తుందో తెలుసుకుందాం.

50 ఏళ్ళ వయస్సులో 35 లా కనిపించాలంటే

రెడ్ లైట్ థెరపీ అంటే ఏమిటి?

రెడ్ లైట్ థెరపీని యాంటీ ఏంజింగ్ థెరపీ అంటారు. ఇందులో చర్మంపై తక్కువ తీవ్రత కలిగిన ఎరుపు కాంతి విడుదలవుతుంది.

రెడ్ లైట్ థెరపీ ఏం చేస్తుంది.

కణాల శక్తి కేంద్రమైన మైటోకాండ్రియా ఎరుపు కాంతి కణాలను గ్రహిస్తుంది. ఇది మైటోకాండ్రియాలో అడెనోసిన్ ట్రైఫాస్పేట్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

ఇది కూడా చదవండి: 7 రోజుల్లోనే ఊహించని అద్భుతం.. రోజూ పొద్దునే కానీ.. రాత్రి పడుకునే ముందు కానీ ముఖానికి ఇది రాసుకుంటే..!

కణాలు మరమ్మత్తు..

దీని కారణంగా కణాలు మెరుగ్గా తయారవుతాయి. ఇది చర్మాన్ని సరిచేయడంలో కొత్త కణాల పెరుగుదలకు ప్రోత్సాహంగా ఉంటుంది.

కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.

పెరుగుతున్న వయస్సుతో కొల్లాజెన్ పరిమాణం తగ్గుతుంది. దీని కారణంగా వృద్ధాప్య ప్రభావం చర్మం మీద కనిపిస్తుంది. రెడ్ లైట్ థెరపీ కొల్లాజెన్ మొత్తాన్ని పెంచడానికి పనిచేస్తుంది.

రెడ్ లైట్ మొటిమలను తొలగిస్తుంది.

ఈ చికిత్స సెబమ్ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. కెరాటినోజెనిసిస్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలు వేగంగా తగ్గడానికి సహకరిస్తుంది. వాపును తగ్గిస్తుంది.

ముడతలు తగ్గుతాయి.

రెడ్ లైట్ యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తుంది. ఫైబ్రోబ్లాస్ట్ ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కొల్లాజెన్ ప్రోటీన్ ప్రవాహాన్ని పెంచుతుంది. దీని కారణంగా చర్మం ముడతలు తగ్గతాయి.

మచ్చలను తొలగిస్తుంది.

రెడ్ లైట్ థెరపీతో మచ్చలు పోతాయి.


బొల్లి మచ్చలకు కూడా..

చర్మానికి సంబంధించి రెడ్ లైట్ థెరపీ సహాయంతో నయం చేయచ్చు. బొల్లి వంటి వ్యాధులు కూడా నయం అవుతాయి. RLTమెలనోసైట్ ల ఉత్పత్తిని మెరుగుపరచడంలో పిగ్మెంటేషన్ పెంచుతుంది.

జుట్టుకు ప్రయోజనకరం..

థెరపీ హెయిర్ ఫోలికల్స్ లోని ఎపిడెర్మల్ స్టెమ్ సెల్స్ ను ఉత్తేజ పరిచి, జుట్టు తిరిగి వచ్చే విధంగా ప్రోత్సహిస్తుంది.తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుంది.

ఇది బరువును కూడా నియంత్రిస్తుంది.

రెడ్ లైట్ థెరపీ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో ముందుంటుంది.

Updated Date - 2023-10-01T12:32:45+05:30 IST