Share News

Weight Gain Foods: ఎంత తిన్నా.. అస్సలు లావు పెరగడం లేదా..? బక్కగా ఉన్నవాళ్లు ఈ 10 ఆహార తింటే..!

ABN , First Publish Date - 2023-11-13T14:05:54+05:30 IST

వీటిని తీసుకోవడం వల్ల కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా అందుతాయి. శరీరాన్ని ధృఢంగా, శక్తివంతంగా తయారుచేస్తాయి.

Weight Gain Foods: ఎంత తిన్నా.. అస్సలు లావు పెరగడం లేదా..? బక్కగా ఉన్నవాళ్లు ఈ 10 ఆహార తింటే..!
protein Food

సన్నగా బక్కపలచగా ఉంటే శాఖాహారులైతే ఏం తినాలి, ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి శరీరానికి ఏ పదార్థాలు సహకరిస్తాయి. కాయధాన్యాలు, ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా కూడా బలంగా తయారు కావచ్చు. సన్నగా బక్కపలచగా ఉండే వారికి ఇవి పెట్టి చూడండి.

వెజిటేరియన్ ఫుడ్స్ తో బరువు పెరుగుతారు.

బరువు పెరగడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శాఖాహారులైతే, ఆరోగ్యకరమైన వాటిని బరువు పెరగడంలో ఏ విధంగా తీసుకోవాలి. చికెన్, మటన్ కాకుండా, వేటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని లావుగా చేస్తాయి.

సోయా ఉత్పత్తులు

సోయా బీన్స్, సోయా మిల్క్,టోఫులో ప్రోటీన్, ఇతర పోషక మూలకాలు ఉన్నందున బరువు పెరగడానికి మంచి వనరులు.

నట్స్, డ్రై ఫ్రూట్స్..

బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్షలను తీసుకోవడం వల్ల చాలా కేలరీలు, పోషకాహారం శరీరానికి అందుతుంది. ఇది బరువు పెరగడంలో సహాయపడుతుంది.

చీజ్, అవోకాడో

పనీర్ పాల నుండి తీసే ప్రోటీన్ పదార్థాలు ఆరోగ్యకరమైన పోషకాలకు మూలం. ఇక అవోకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి, ఇవి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరగడంలో సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: దీపావళికి బాంబులు పేల్చుతూ.. పొరపాటున చేతులు, కాళ్లపై గాయాలయ్యాయా..? వెంటనే తగ్గేందుకు ఏం చేయాలంటే..!

బీన్స్, పప్పుదినుసులు..

కందిపప్పు, మినపప్పు, శనగపప్పు లాంటివి, రాజ్మా, ఆవుపాలు, చిక్కుళ్ళలో ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

పెరుగు, ఇతర పాల పదార్థాలు..

పెరుగు, పాల పదార్థాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా అందుతాయి. శరీరాన్ని ధృఢంగా, శక్తివంతంగా తయారుచేస్తాయి.

చిలకడ దుంప..

ఇది రుచిగానే కాదు, పోషకాలను కూడా అధికంగా కలిగి ఉంది. ప్రోటీన్లు, పీచుపదార్థాలు అధికంగా ఉన్నాయి. దీనిని మరీ ఎక్కువగా కాకుండా తగినంత పరిమాణంలో వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవడం మంచిది.

Updated Date - 2023-11-13T14:09:16+05:30 IST