Chicken: షాపులోంచి చికెన్‌ను తీసుకురాగానే కడిగేస్తున్నారా..? అందరూ తెలియక చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే..!
ABN , First Publish Date - 2023-09-27T13:48:19+05:30 IST
ఏడాదికి ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన దాదాపు 2 లక్షల కేసుల్లో దాదాపు 50 వేల కేసులు కోడి మాంసానికి సంబంధించినవే.
సండే వచ్చిందంటే మామూలుగా అందరూ తినే ఆహారంలో మాంసాహారం ఉంటుంది. ఇందులో మెయిన్ గా చికెన్ ఉంటుంది. అయితే వంట చేసే ముందు బజారు నుంచి తెచ్చిన చికెన్ ని శుభ్రంగా కడిగి తయారు చేస్తాం ఇలా చేయడం అనేది ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిది.. ఇలా చేయడంలో మనం చేస్తున్న మిస్టేక్ ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం.
చికెన్ సాధారణంగా వంట చేయడానికి ముందు శుభ్రంగా కడుగుతాం. ఇది సర్వసాధారణంగా ఆడవారు అంతే చేసేదే.. మరి ఈ విషయంలో శాస్త్రవేత్తలు అలా చేయకూడదనుకుంటున్నారు. ఆ అలవాటును వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు.
తాజా అధ్యయనాలలో చాలా వరకు చికెన్ వంట చేయడానికి ముందు కడుగుతారు. దాదాపు 25% మంది చికెన్‌ను ముందే కడుగుతున్నట్లు తేలింది. ఇలా చేయడం వల్ల కలిగే నష్టాల గురించి అధ్యయనంలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యానికి సంబంధించి, కాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా అనే రెండు ప్రధాన బ్యాక్టీరియా ఉంటుంది.
ఇవి సాధారణంగా పౌల్ట్రీ మాంసంలో కనిపిస్తాయి. అందువల్ల పచ్చి మాంసాన్ని కడగడం వల్ల బ్యాక్టీరియా ప్రతిచోటా వ్యాపించి వ్యాధి ముప్పును పెంచుతుందని పరిశోధనలో తేలింది. గత రెండు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో ఈ బ్యాక్టీరియా కేసులు రెట్టింపు అయ్యాయి. ఏడాదికి ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన దాదాపు 2 లక్షల కేసుల్లో దాదాపు 50 వేల కేసులు కోడి మాంసానికి సంబంధించినవే.
ఇది కూడా చదవండి: అన్నం తినడం మానేస్తే ఈజీగా బరువు తగ్గొచ్చా..? 5 రోజుల పాటు ఉపవాసం ఉంటే జరిగేది ఏంటంటే..!
కడిగిన చికెన్ వల్ల ఉపరితల నీటి బిందువుల నుంచి ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుందట. అలాగే, చికెన్‌ను పంపు నీటితో వేగంగా కడిగిన తర్వాత, నీటి బిందువుల నుండి బ్యాక్టీరియా మరింత వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నీటి ప్రవాహంతో పాటు బ్యాక్టీరియా వ్యాప్తి శాతం కూడా పెరిగిందని అధ్యయనంలో వెల్లడైంది. అందువల్ల, చికెన్ వేడినీటితో కడగాలి.