Onion Peels: ఇది తెలియక ఎంత ఉల్లిపాయ పొట్టును చెత్తబుట్టలో పారేసి ఉంటారో.. ఈ సంగతి ముందే తెలిసి ఉంటే బంగారంలాగా..!

ABN , First Publish Date - 2023-07-01T12:50:59+05:30 IST

ఇది ఊబకాయం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లను నియంత్రించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Onion Peels: ఇది తెలియక ఎంత ఉల్లిపాయ పొట్టును చెత్తబుట్టలో పారేసి ఉంటారో.. ఈ సంగతి ముందే తెలిసి ఉంటే బంగారంలాగా..!
benefits of onion chilke

ఉల్లిపాయ లేనిదే ఒక్క కూరా పూర్తి కాదు. ఉల్లిపాయల మీద అంతగా ఆధారపడిపోయాం మనం. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే నానుడి ఎలానూ ఉంది. ఉల్లిపాయను వంటకాల్లోనే కాకుండా ఇంకా చాలా విధాలుగా వాడుతూ ఉంటాం. అయితే ఉల్లిపాయలు కూరల్లో వాడేసి, వాటి పొట్టును నిర్లష్యంగా పారేస్తూ ఉంటాం. అయితే దీనితో కూడా చాలా ఉపయోగాలున్నాయట అవేంటో తెలుసుకుందాం.

చాలా మంది ఉల్లిపాయలు తరగడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఇది కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది. అయితే, ఉల్లిపాయ తొక్కుల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకున్న తర్వాత, వాటిని ఇక అసహ్యించుకోలేరు. మనమందరం తరచుగా ఉల్లిపాయ తొక్కులను చెత్తలో వేస్తాము, కానీ ఉల్లిపాయ పొట్టులో ఆరోగ్యానికి అద్భుతాలున్నాయి. ఉల్లిపాయ తొక్కులు మంచి పోషకాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి అనేక విధాలుగా సహాయపడతాయి. ఉల్లిపాయ తొక్కులు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. అవి చర్మం, జుట్టుకు మంచివి. కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఉల్లిపాయ తొక్కులను ఉపయోగించే కొన్ని మార్గాలు..

1. దురదను, ఫంగల్ లక్షణాలకు..

ఉల్లిపాయ తొక్కులు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మంపై దురదలు, దద్దుర్లు తగ్గించడంలో సహాయపడతాయి. దద్దుర్లు నుంచి ఉపశమనం పొందడానికి చర్మంపై ఉల్లిపాయ తొక్కు నీటిలో నానబెట్టి ఆ నీటిని రాయవచ్చు. ఇలా చేస్తే ఫంగల్ లక్షణాలు తగ్గిపోతాయి.

2. హెయిర్ డైగా ఉపయోగించండి.

ఈ ఉల్లిపాయ తొక్కుతో తెల్లజుట్టును నల్లగా మార్చవచ్చు. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు పోషణ అందించడం ద్వారా తెల్ల జుట్టును నలుపు రంగులోకి మారుస్తుంది. అంతే కాకుండా, ఇది జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.

ఇది కూడా చదవండి: ప్రసవించగానే మరణించే అయిదు వింత జీవులు.. కన్న పిల్లలను కళ్లారా చూసుకునే భాగ్యం వీటికి ఉండదు..!

3. ఖనిజాల మూలం

ఉల్లిపాయ తొక్కులలో మన శరీరం పనితీరుకు అవసరమైన ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి. ఉల్లిపాయ తొక్కులను ఉపయోగించడం వల్ల ఈ ఖనిజాలన్నీ లభిస్తాయి. ఇది ఊబకాయం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లను నియంత్రించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

4. హెయిర్ టోనర్

పొడి, నిర్జీవమైన జుట్టు కోసం ఉల్లిపాయ తొక్కులను హెయిర్ టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఉల్లిపాయ తొక్కుల రంగు గోధుమ రంగులోకి వచ్చే వరకు నీటిలో ఉడకబెట్టడం ఈ టోనర్‌ను తయారు చేసుకోవచ్చు.

Updated Date - 2023-07-01T13:01:35+05:30 IST