Pregnant Woman : ఏ ఆస్పత్రిలో చూసినా అన్నీ ఆపరేషన్లే.. అసలు ఏం చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందంటే..!
ABN , First Publish Date - 2023-11-11T02:07:54+05:30 IST
బిడ్డ పుట్టే సమయంలో ఆకు కూరలు తప్పక తీసుకోవాలి. మునగ, కివి, ఆరెంజ్, బీట్‌రూట్ తింటే రక్తహీనత నయమవుతుంది.
గర్భధారణ సమయంలో నార్మల్ డెలివరీ కావాలనే అందరు తల్లులూ అనుకుంటారు. చివరి నిమిషంలో ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం అనే సందర్భం వచ్చేసరికి ఇష్టం లేకపోయినా కూడా ఆపరేషన్ వైపు వెళ్లక తప్పదు. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది. ఇలా ఏ హాస్పటల్ చూసినా ఇలాగే చివరి నిమిషంలో చెబుతూ ఉంటారు. గర్భధారణ సమయంలో వైద్యులు చాలా సూచనలు చేస్తూ ఉంటారు. గర్భిణి తీసుకునే ఆహారం., రోజువారీ పనులు చార్ట్ తో పాటు దినచర్య ఎలా ఉండాలి అనే విషయంగా కూడా తమ సూచనలను ఇస్తారు. అయితే బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి తల్లి తీసుకోవలసిన ఆహారం, గురించిన పూర్తి సమాచారం ఉంటుంది. అయితే తల్లి ఆరోగ్యం అప్పటి పరిస్థితుల మీద ఆధారపడి మాత్రమే ఆపరేషన్ అనే అంశం ఉంటుంది.
మొదటి సెమిస్టర్‌లో అంటే గర్భం దాల్చిన 1 నుంచి 3 నెలల మధ్య మహిళలు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెబుతున్నారు. ఈ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించకూడదు. అలాగే బొప్పాయి, పైనాపిల్, జాక్‌ఫ్రూట్ తినకపోవడం మంచిది.
రెండవ సెమిస్టర్ 3 నుండి 6 నెలల వరకు ఉంటుంది. ఈ కాలంలో, శరీరం బరువు పెరగాలి, పిండం అభివృద్ధి చెందాలి. జీర్ణక్రియ స్థితిని కూడా గుర్తుంచుకోవాలి. ఇందులో ఆకుకూరలు, పాలు, పెరుగు తినాలి.
ఇది కూడా చదవండి: బంగారం కొంటున్నారా..? బీ కేర్‌ఫుల్.. హాల్‌మార్కింగ్ అసలుదో.. నకిలీదో ఎలా తెలుసుకోవాలంటే..!
ప్రసవ సమయంలో రక్త నష్టం జరగకుండా ఉండాలంటే కాల్షియం, విటమిన్ ఇ సమృద్ధిగా తీసుకోవాలి. బిడ్డ పుట్టే సమయంలో ఆకు కూరలు తప్పక తీసుకోవాలి. మునగ, కివి, ఆరెంజ్, బీట్‌రూట్ తింటే రక్తహీనత నయమవుతుంది.
రోజూ 1 లీటరు పాలను తీసుకోండి, ఇది 1 గ్రాము కాల్షియంను అందిస్తుంది, ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరి నీరు శరీరానికి సమతుల్య ఆహారాన్ని అందిస్తుంది, ఇది కాకుండా, తినేటప్పుడు, 50% చపాతీ, అన్నం, పప్పులతో సహా ఇతర పదార్థాలను చేర్చాలి. ఇవన్నీ డెలివరీ సమయంలో గర్భిణికి బలాన్ని అందించడంలో సహాయపడతాయి. పరిస్థితి ఆపరేషన్ వరకూ వెళ్ళకుండా ఉంటుంది.