Share News

Shaving Cream: వావ్.. షేవింగ్ క్రీమ్ ఇలా కూడా పనికొస్తుందా..? ఈ 4 పనులు కూడా చేయొచ్చని తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-11-24T16:28:11+05:30 IST

అలాంటి మరకలు పోవాలంటే మాత్రం షేవింగ్ క్రీమ్ చక్కగా పనిచేస్తుంది.

Shaving Cream: వావ్.. షేవింగ్ క్రీమ్ ఇలా కూడా పనికొస్తుందా..? ఈ 4 పనులు కూడా చేయొచ్చని తెలిస్తే..!
cream

ముఖాన్ని అందంగా ఉంచడానికి మగవారు షేవింగ్ చేస్తూ ఉంటారు. దీనికోసం షేవింగ్ క్రీమ్ వాడతారు. ఇది ముఖం మీద వెంట్రుకలను మెత్తగా తొలగించడంలో సహకరిస్తుంది. దీని సహాయంతో ఇంకా ఏం చేయచ్చో చూద్దాం.

ప్రతిరోజూ బంగారం, వెండి ఆభరణాలను ధరిస్తూ ఉంటాం. కొన్ని రోజులకి ఇవి పాత బడినట్టుగా కనిపిస్తాయి. వీటికి మెరుపు తెచ్చేందుకు షేవింగ్ క్రీమ్ సరిగ్గా సరిపోతుంది. షేవింగ్ క్రీమ్‌తో తేలికగా రుద్దుతూ పదినిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేయడం వల్ల ఆభరణాలు మెరుస్తూ కనిపిస్తాయి.

స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలకూ మెరుపు వస్తుంది..

వంటగదిలో ఉండే అనేక వస్తువులు, వంటపాత్రలను సంవత్సరంలో ఒకసారి పైనుంచి తీసి తోముతూ ఉంటాం ఇందులో చాలావరకూ చింతపండునే ఉపయోగిస్తాం. అయితే స్టెయిన్ లెస్ స్టీల్ సామాన్లను షేవింగ్ క్రీమ్‌తో క్లీన్ చేయడం వల్ల కొత్త మెరుపు వస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ 3 టెక్నిక్స్‌ను ఫాలో అయితే.. వారం రోజులు దాటినా.. పాలకూర తాజాగా ఉండటం ఖాయం..!


కార్పెట్ మీద మరకలు పోవాలంటే..

కార్పెట్ మీద పడిన మరకలు చాలా వరకూ ఎంత తుడిచినా పోవు. అలాంటి మరకలు పోవాలంటే మాత్రం షేవింగ్ క్రీమ్ చక్కగా పనిచేస్తుంది. కార్పెట్ తడిసిన ప్రేదేశంలో క్రీమ్ పూసి ఉంచి టిష్యూతో శుభ్రం చేస్తే మరకలు ఇట్టే పోతాయి.

నెయిల్ పెయింట్ కూడా తీసేయచ్చు..

నెయిల్ పెయింట్ ను రిమూవర్ లేకపోయినా కూడా షేవింగ్ క్రీమ్ పాత నెయిల్ పెయింట్ ను రెండు మూడు నిమిషాల్లో రిమూవ్ చేయగలదు.

Updated Date - 2023-11-24T16:28:13+05:30 IST