Share News

Morning Walking : ఉదయం పూట ఖాళీ కడుపుతో నడవడం వల్ల కలిగే లాభాలేంటంటే..!

ABN , First Publish Date - 2023-11-17T15:59:18+05:30 IST

నడకతో కాస్త నెమ్మదిగా అయినా బరువు తగ్గచ్చు.

Morning Walking : ఉదయం పూట ఖాళీ కడుపుతో నడవడం వల్ల కలిగే లాభాలేంటంటే..!
Walking

మార్నింగ్ వాక్ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రోగ నిరోధక శక్తిన పెంచుతుంది. కీళ్లనొప్పులు రాకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండటంలో నడక ప్రధానంగా పనిచేస్తుంది. ఉదయం పూట నడిచే 30 నిమిషాల నడక అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే ఉదయాన్నే ఎందుకు నడవాలి. సాయంత్రం నడక ఎంతవరకూ మంచిది అనేది తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో నడవడం..

మార్నింగ్ వాక్ అనేది మెరుగైన జీర్ణక్రియకు సహకరిస్తుంది. రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గించడంలో కడుపును ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది.

ఆరోగ్యకరమైన గుండె

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నడవడం గుండెకు మంచిది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కొవ్వును తగ్గిస్తుంది.

ఖాళీ కడుపుతో నడవడం వల్ల మన శరీరంలోని కొవ్వును కరిగించుకుని, ఆ శక్తిని ఇంధనంగా నిల్వ చేస్తుంది.

రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.

ఉదయాన్నే నడవడం అనేది షుగర్ వ్యాధి ఉన్నవారిలో అయితే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మధుమేహం, ప్రీడయాబెటిస్ ఉన్నవారు ఈ వ్యాయామం చేయడం మంచిది.

ఇది కూడా చదవండి: అల్పాహారంగా ఆరోగ్యానికి గుడ్లు, డ్రైఫ్రూట్స్ వీటిలో ఏవి బెస్ట్..!

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఉదయాన్నే షికారులా నడవడం అనేది రోజంతా ఆహ్లాదంగా ఉండేలా చేస్తుంది. ఆరుబయట నడవడం అనేది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.


బరువు తగ్గడంలో కూడా..

నడకతో కాస్త నెమ్మదిగా అయినా బరువు తగ్గచ్చు. ఇది జీవక్రియను పెంచడమే కాదు కేలరీల లోటును కూడా భర్తీ చేసి బరువు తగ్గేలా చేస్తుంది.

ఒత్తిడి

పగటిపూట వ్యాయామం చేయడం కన్నా, ఉదయం పూట నడక చాలావరకూ ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.

Updated Date - 2023-11-17T16:05:29+05:30 IST