Headache: పదే పదే తలనొప్పి వేధిస్తోందా..? అయితే దానికి అసలు కారణం ఇదే కావచ్చు.. ఆ వ్యాధి ఉన్నవాళ్లకు..!

ABN , First Publish Date - 2023-06-20T13:32:26+05:30 IST

హైడ్రేషన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది,

Headache: పదే పదే తలనొప్పి వేధిస్తోందా..? అయితే దానికి అసలు కారణం ఇదే కావచ్చు.. ఆ వ్యాధి ఉన్నవాళ్లకు..!
type-2 diabetes

చిన్న శబ్దం విన్నా కూడా తలపోటు, కాస్త ఎక్కువమంది ఉన్నచోట గడిపినా, ఎక్కువగా మాట్లాడినా కూడా తలనొప్పి వస్తుందా..? ఇది చాలా మందిలో కనపించే సమస్యే. ఆరోగ్య నిపుణులు చెప్పే ప్రకారం తలనొప్పి, మైగ్రేన్ లతో బాధపడే కారణాలు అనేకంగా ఉంటాయి. ఇందులో రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉండటం లేదా అకస్మాత్తుగా పడిపోవడం వంటివి కూడా జరుగుతాయి. అదే డయాబెటిస్‌తో బాధపడేవారైతే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్‌ను ఉపయోగించలేరు. దీనికి కారణం తలనొప్పి ఎక్కువగా ఎపినెఫ్రైన్ (Epinephrine), నోర్‌పైన్‌ఫ్రైన్ (Norepinephrine) వంటి హార్మోన్ల స్థాయిలను మార్చడం వల్ల మొదలవుతుంది., ఇవి మెదడులోని రక్తనాళాలను కుదించి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

డయాబెటిస్‌లో తలనొప్పి..

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రకారం, తలనొప్పికి కారణమయ్యే హైపర్గ్లైసీమియా (Hyperglycemia)ను జీవనశైలి మార్పులతో నివారించవచ్చు.

క్రమం తప్పకుండా వ్యాయామం.

శారీరక శ్రమ సమయంలో శరీరం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది, ఇవి సహజమైన నొప్పి నివారిణిగా పనిచేస్తాయి కాబట్టి రెగ్యులర్ వ్యాయామాలు మైగ్రేన్‌లను తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడే హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (High-intensity interval training), యోగా (yoga), సైక్లింగ్ (cycling), రన్నింగ్ (running) మొదలైన వాటిలో బిజీకండి.

ఇది కూడా చదవండి: ఈ ఫొటోలోని వింత ఆకారమేంటో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.. దీని బరువెంతో చూసి డాక్టర్లే షాకయ్యారు..!

ఆహార నియంత్రణ

ఆరోగ్య నిపుణులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్‌లను తీసుకోవాలి. మెగ్నీషియం అధికంగా ఉండే ఆకు కూరలు, అవకాడో, ట్యూనా వంటి ఆహారంలో చేర్చాలి. చేపలు, చిక్కుళ్ళు వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఆహారంలో ఉండేట్టు చూడాలి.

హైడ్రేట్

హైడ్రేషన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది గ్లూకోజ్‌ని సాధారణ స్థితికి తీసుకురావడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా వేసవిలో, ఎలక్ట్రోలైట్ ద్రావణ పానీయాలు శరీర పనితీరుకు అవసరమైన ఖనిజాలను తిరిగి నింపడంలో సహాయపడతాయని వైద్యులు అంటున్నారు.

Updated Date - 2023-06-20T13:32:26+05:30 IST