Share News

Miracle Plant: భారత్‌లో మాత్రమే కనిపించే మిరాకిల్ మొక్క ఇది.. దీని ముందు ఎన్ని మెడిసిన్స్ అయినా బలాదూర్..!

ABN , First Publish Date - 2023-11-09T23:55:11+05:30 IST

అధిక రక్తపోటు సమస్యను, సర్పగంధి తగ్గిస్తుంది. రౌవోల్ఫియా మొక్క మూలాలు రెసెర్పైన్ అనే ఆల్కలాయిడ్ ఉత్పత్తి చేస్తాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది.

Miracle Plant: భారత్‌లో మాత్రమే కనిపించే మిరాకిల్ మొక్క ఇది.. దీని ముందు ఎన్ని మెడిసిన్స్ అయినా బలాదూర్..!
snake root

మన చుట్టూ ప్రకృతిలో చాలా రకాల మొక్కలున్నాయి. అందులో కొన్ని మాత్రమే అరుదైన ఔషదాలుగా తరతరాలుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఆయుర్వేదంలో ముఖ్యంగా కొన్ని మొక్కలు అయితే మరీ అరుదుగా లభిస్తూ ఉంటాయి. వాటిలో భారతదేశంలో అద్భుతమైన మొక్కగా చెప్పే ఔషధ గుణాలున్న మొక్క సర్పగంధ అంటే స్నేక్ రూట్ గా ఈ మొక్కను ఆయుర్వేదంలో పిలుస్తారు. చిన్న పువ్వులతో తెల్లగా ఉండే ఈ మొక్క గురించి తెలుసుకుందాం.

సర్పగంధ చాలా అద్బుతమైన ఔషదం. దీని సహాయంతో అనే రుగ్మతలను తగ్గించవచ్చు. పురాతన నుంచి సర్పగంధ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీని శాస్త్రీయ నామం రౌవోల్ఫియా సెర్పెంటినా... చాలా వ్యాధుల్లో దీని మూలాలను వాడుతున్నారు.

ఇది కూడా చదవండి; మునక్కాయల గురించి ఈ ప్రచారంలో అసలు నిజమెంత..?


సర్పగంధి ఉపయోగాలు..

అధిక రక్తపోటు సమస్యను, సర్పగంధి తగ్గిస్తుంది. రౌవోల్ఫియా మొక్క మూలాలు రెసెర్పైన్ అనే ఆల్కలాయిడ్ ఉత్పత్తి చేస్తాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది.

స్పర్పగంధి వేర్లు, కాండం భాగాలతో జ్వరానికి మందుగా ఉపయోగిస్తారు. మలేరియా, నిద్రలేమి, మానసిక రుగ్మతలకు చికిత్స చేస్తారు. నాడీ వ్యవస్థ శాంత పరిచే విధానంలో కూడా సర్పగంధిని వాడతారు. మూడ్ డిజార్డర్స్ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కడుపు సమస్యలు కూడా దీనితో నయం అవుతాయి.

మొటిమల సమస్య, సర్పగంధి చాలా చక్కగా పనిచేస్తుంది. పాము కాటుకు కూడా సర్పగంధిని వాడతారు. ఆస్తమా చికిత్సలో కూడా సర్పగంధిని వాడతారు.

దీనిని వైద్యుల నిపుణుల సలహామీద మాత్రమే తీసుకోవాలి.

Updated Date - 2023-11-09T23:55:25+05:30 IST