Health Tips: ఈ తెల్లటి నువ్వుల్ని రోజూ కాసిన్ని తినండి చాలు.. కొవ్వు దానంతట అదే కరిగిపోవడం ఖాయం..!
ABN , First Publish Date - 2023-12-05T14:28:11+05:30 IST
నువ్వులు నోటి శుభ్రతకు, దంతాలను కావిటీస్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.
నువ్వుల గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య నిపుణులు చెప్పేదాని ప్రకారం, విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చిన్న గింజలైన నువ్వుల్లో పుష్కలంగా ఉన్నాయి. పిల్లలకు పెద్దలకు నువ్వులు మంచి పోషకాహారంగా పనిచేస్తుంది. ఆహారంలో నువ్వుల్ని చేర్చుకోవడం వల్ల ఏమో వ్యాధులకు దూరంగా ఉండవచ్చో చూద్దాం.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
నువ్వులు కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటును కూడా నియంత్రించడంలో సహకరిస్తాయి.
అంటువ్యాధులకు చెక్..
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ ఎలిమెంట్స్ శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాటుతాయి. ఈ విధంగా శరీరం అనేక రకాల వ్యాధుల నుంచి రక్షింపబడుతుంది. కణాలు దెబ్బతినే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: చలికాలంలోనే గుండెపోటు కేసులు ఎందుకు ఎక్కువ..? అసలు కారణాలు ఏంటంటే..!
దంతాలను దృఢంగా మార్చుతుంది.
నువ్వులు నోటి శుభ్రతకు, దంతాలను కావిటీస్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. కాల్షియం ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలకు బలాన్ని ఇస్తుంది.
మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
నువ్వుల నూనె మధుమేహం టైప్ టూ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
క్యాన్సర్ ప్రమాదం..
నువ్వుల్లోని యాంటీ ఆక్సిడంట్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు సహకరిస్తాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.