Eggs vs Nuts: అల్పాహారంగా ఆరోగ్యానికి గుడ్లు, డ్రైఫ్రూట్స్ వీటిలో ఏది బెస్ట్..!
ABN , First Publish Date - 2023-11-17T14:08:53+05:30 IST
ఉదయాన్నే అల్పాహారంలో గుడ్డు తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మంచి సపోర్ట్‌గా ఉంటుంది.
మనం రోజువారి తీసుకునే ఆహారంలో చాలావరకూ ఆరోగ్యానికి మంచి చేసే పదార్థాలనే ఎంచుకుంటూ ఉంటాం. అయితే ఉదయాన్నే తీసుకునే అల్పాహారంలో గుడ్లు తీసుకుంటూ ఉంటాం. వాటి స్థానంలో వాల్ నట్స్, లేదా వేరే ఇతర పదార్థాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను, ఇబ్బందులు ఏంటంటే..
పోషకాలు
బాదం, వాల్ నట్స్, పిస్తాలు వంటివి ఆరోగ్యాకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలను పుష్కలంగా అందిస్తాయి. ఇవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి విభిన్న రకాల పోషరకాలను అందిస్తాయి. ఇవన్నీ కలిపి మొత్తం ఆరోగ్యానికి సహకరిస్తాయి.
జంతు ఆధారిత, మొక్కల నుంచి తీసుకునే పోషకాహారం..
ఈమధ్య జరిగిన పరిశోధనల్లో జంతు ఆధారిత ఆహారం, ప్రాసెస్ చేసిన మాంసం, గుడ్లు, పౌల్ట్రీ ఆహారాలు కార్డియోమెటబాలిక్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తేలింది. అలాగే గుడ్డు, వాల్ నట్స్ తో ఈ ప్రమాదాన్ని కొంతవరకూ తగ్గించవచ్చని తేలింది.
ఆహారం, కార్డియోవాస్కులర్ వ్యాధి.. CVD
మనం తీసుకునే ఆహారం 50 గ్రాముల ప్రాసెస్ చేసిన మాంసానికి సమాన మొత్తంలో చిక్కుళ్ళు, బీన్స్, పప్పులు తీసుకోవడం వల్ల CVD కారణంగా జరిగే మరణాలను చాలావరకూ తగ్గించవచ్చు. CVDప్రమాదాన్ని 27% వరకూ తక్కువగా ఉంటుందట.
ఇది కూడా చదవండి: పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. వీటితో కలిపి తీసుకుంటే మాత్రం ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే..!
వాల్ నట్స్ స్థానంలో ఇవి..
ఉదయాన్నే అల్పాహారంలో గుడ్డు తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మంచి సపోర్ట్‌గా ఉంటుంది. వాల్ నట్స్ లోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బరువును అదుపులో ఉంచడానికి కూడా గుడ్డు మంచి ఆహారం.
శాకాహారం..
రోజూ మనం తీసుకునే ఆహారంలో పండించిన కూరగాయలు, పండ్లు, ధాన్యాల కన్నా సేంద్రీయ ఆహారం కాస్త ఖరీదు ఎక్కువగా ఉన్నా కూడా ఆరోగ్యానికి పప్పు దినుసులు, ఆకు కూరలు అన్న పోషణను అందిస్తాయి. పప్పులలో ఉండే 60 శాతం కార్బోహైడ్రేట్లు, 5 శాతం కొవ్వు, 2 శాతం ఖనిజ లవణాలు ఉంటాయి. అలాగే కోడి గుడ్డు, మాంసాలలో కంటే ఐదారు ఖర్జూరపు పండ్లు ఎక్కవ శక్తిని ఇస్తాయి. అయితే ఏది తీసుకోవాలి అనే విషయంగా వైద్య సలహా మీద తీసుకుని తినడం మంచిది.