Man Boobs: మగాళ్లలో కొందరి రొమ్ములు.. స్త్రీల స్థనాల్లా ఉండటం వెనుక అసలు కారణం ఇదన్నమాట..!
ABN , First Publish Date - 2023-11-20T17:07:10+05:30 IST
హార్మోన్ల అసమతుల్యత కారణంగా తక్కువ టెస్టోస్టెరాన్ లేదా ఈస్ట్రోజెన్, అధిక స్థాయిల కారణంగా రొమ్ము కణజాలం మొత్తంలో పెరుగుదలకు దారితీస్తుంది.
ఆడవారిలో ఎంతో అందంగా కనిపించే అవయవాలు, మగవారిలో కనిపిస్తే అది కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. అదే వక్షోజాలు మగవారిలో పెరుగుతున్నట్లుగా గమనిస్తే దానిని గైనెకోమాస్టిమా కారణంగా ఆందోళన, నిరాశ, అపహాస్యం లాంటి ఆత్మగౌరవాన్ని తగ్గించే విధంగా ఉంటుంది. ఈ విషయంగా ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
స్త్రీలలానే పురుషుల్లో కూడా పెద్ద రొమ్ములు కనిపించడం అనే సమస్య చాలా వరకూ ఈమధ్య కనిపిస్తూ ఉంది. ఈ సమస్య మగవారిలో 21 నుంచి 40 ఏళ్ళలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనితో ఆందోళన, నిరాశను భరించలేక శస్త్రచికిత్సలకు వెళతారు. అయితే ఇది మరింత ఇబ్బందిని తెస్తుందా.. స్త్రీలలోనే కాదు, పురుషులలోనూ కాస్మోటిక్స్ సర్జరీలు ఎక్కువగానే పెరుగుతున్నాయి. ఇది గైనెకోమాస్టియా అని పిలువబడే ఆరోగ్య పరిస్థితి.
ఇది కూడా చదవండి; మహిళల కంటే మగాళ్లే ఎందుకు త్వరగా చనిపోతారంటే..!
ఈ పరిస్థితి హార్మోన్ల అసమతుల్యత కారణంగా తక్కువ టెస్టోస్టెరాన్ లేదా ఈస్ట్రోజెన్, అధిక స్థాయిల కారణంగా రొమ్ము కణజాలం మొత్తంలో పెరుగుదలకు దారితీస్తుంది. మగ రొమ్ము కణజాలం ఉబ్బి పెద్దదిగా కనిపిస్తుంది. కానీ ఊబకాయం, స్టెరాయిడ్ వాడకం, కొన్ని మందులు, మూత్రపిండాల వ్యాధి లేదా మూత్రపిండాల వైఫల్యం, కాలేయ వ్యాధి, థైరాయిడ్ సమస్యల వల్ల కూడా ఇది జరగవచ్చు.
పురుషుల జనాభాలో 70% మందికి రొమ్ము విస్తరించడం అంటే గైనెకోమాస్టియా. గత సంవత్సరం పురుషులు 30 నుంచి 34 శస్తచికిత్సలు చేయించుకున్నారు. బరువు తగ్గడం లేదా ప్రిస్క్రిప్షన్ మందులను ఎంచుకోవడం రొమ్ముల పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ ఈ పరిస్థితికి చికిత్స చేయడానికి శస్త్రచికిత్స అనేది శాశ్వతమైన మార్గాలలో ఒకటి కాకపోవచ్చు.. అయితే కొవ్వు గ్రంధిని తొలగించడం ద్వారా ఈ శస్త్రచికిత్స జరుగుతుంది. శరీర ఇమేజ్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కానీ మళ్ళీ తిరిగి యధాస్థితికి చేరుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. దీనికి సాస్వత పరిక్షారం అంటే వ్యాయామమే కావచ్చు అంటున్నారు నిపుణులు.