Share News

Heart Failure: నిద్రపోయిన వాళ్లు తెల్లారేసరికి ఎలా చనిపోతున్నారు..? పడుకున్నాక గుండె ఇస్తున్న సీక్రెట్ షాకులు ఇవే..!

ABN , First Publish Date - 2023-10-13T12:30:53+05:30 IST

కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి కూడా ఉంటుంది. దీనికి తక్షణ చికిత్స అందించకపోతే, వ్యక్తి స్పృహ కోల్పోవచ్చు.

Heart Failure: నిద్రపోయిన వాళ్లు తెల్లారేసరికి ఎలా చనిపోతున్నారు..? పడుకున్నాక గుండె ఇస్తున్న సీక్రెట్ షాకులు ఇవే..!
eart or lung disease

కరోనా మహమ్మారి తర్వాత, ఎన్ని గుండెలు ఆగిపోయాయో లెక్కేలేదు. చాలావరకూ ఆరోగ్యంగా ఉన్నవారు, కాస్త వ్యాయామం, మంచి ఆహారం మీద పట్టు ఉన్నవారే.. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది. రాను రానూ గుండె సంబంధిత వ్యాధుల సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్యం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే ఆరోగ్యవంతులు కూడా గుండె వైఫల్యం లేదా సైలెంట్ ఎటాక్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. గుండె ఆగిపోవడాన్ని కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు.

ఇది మీ గుండె మీ శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు ఏర్పుడే వైద్య పరిస్థితి. హార్ట్ ఫెయిల్యూర్ అకస్మాత్తుగా రావచ్చు ఎందుకంటే అప్పటికి గుండె బలహీనమవుతుంది. గుండె వైఫల్యం లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఇలాంటి సంకేతాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. గుండె వైఫల్యం ఈ 5 లక్షణాల గురించి తెలుసుకుందాం.

వేగవంతమైన శ్వాస

వేగవంతమైన శ్వాస అనేది గుండె వైఫల్య లక్షణం, ఇది రాత్రి పూట నిద్రిస్తున్నప్పుడు గుర్తించవచ్చు. దీనిని పార్క్సిస్మల్ నాక్టర్నల్ డిస్‌ప్నియా Paroxysmal nocturnal dyspnoea (PND) అంటారు. ఇది సాధారణంగా గాఢ నిద్రలోకి జారుకున్న కొన్ని గంటల తర్వాత జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూర్చోవడం లేదా నిలబడటం చాలా ముఖ్యం. నిద్రపోతున్నప్పుడు ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించినప్పుడు, అజాగ్రత్తగా ఉండకూడదు, అది కార్డియాక్ అరెస్ట్‌కు సంకేతం.

గుండె దడ

గుండె ఆగిపోయినప్పుడు, హృదయ స్పందన అకస్మాత్తుగా పెరుగుతుంది. దీనిని టాచీకార్డియా Tachycardia అంటారు. ఇది 1 నిమిషంలో గుండె 100 సార్లు కంటే ఎక్కువ కొట్టుకునే పరిస్థితి. ముఖ్యంగా నిద్రలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అజాగ్రత్తగా ఉండకూడదు.

దగ్గు, శ్వాసలోపం

గుండె వైఫల్యం ప్రాధమిక దశ శ్వాసలో గురకతో ప్రారంభమవుతుంది. ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, బ్రోన్కియోల్స్ వాటిని దూరంగా ఉంచే ప్రయత్నంలో కుంచించుకుపోతాయి. దగ్గుతో పాటు గురక కూడా వస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు రావచ్చు. ఈ పరిస్థితిని కార్డియాక్ ఆస్తమా అని పిలుస్తారు, ఈ స్థితిలో నోటి నుండి నురుగు, గులాబీ రంగులో ఉండే కఫం కూడా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: మొబైల్ ఫోన్లే సైలెంట్ కిల్లర్స్.. చిన్న పిల్లల ఆరోగ్యాన్ని స్మార్ట్‌ఫోన్లు ఎలా పాడు చేస్తున్నాయంటే..!


శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

ఏ గుండె సంబంధిత వ్యాధి లక్షణాలు అంత సులభంగా అర్థం కాదు. కానీ గుండె వైఫల్యం కొన్ని లక్షణాల గురించి తెలుసుకోవాలి. రాత్రి నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, అది గుండె వైఫల్యం లక్షణం కావచ్చు. ఇలాంటి సమయంలో హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి, దిండు సహాయం తీసుకుని నిటారుగా కూర్చోవాలి. ఈ పరిస్థితిని ఆర్థోపెనియా Orthopenia అంటారు. అప్పటికే గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారు ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

హఠాత్తుగా మెలకువ వస్తూంటే..

రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మేల్కొలపడం కూడా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ ప్రధాన లక్షణం. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి కూడా ఉంటుంది. దీనికి తక్షణ చికిత్స అందించకపోతే, వ్యక్తి స్పృహ కోల్పోవచ్చు. కొన్ని సందర్భాల్లో, చికిత్స ఆలస్యం అయితే మరణానికి కూడా దారితీస్తుంది. ఇందులో ఏవైనా లక్షణాలను అనుభవిస్తే, వెంటనే చికిత్స తీసుకోవాలి. గుండె వైఫల్యం అనేది తక్షణ అత్యవసర సహాయం అవసరమయ్యే పరిస్థితి. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ఎంతైనా అవసరం.

Updated Date - 2023-10-13T12:30:53+05:30 IST