Teeth Health: దంతాలు పాడవకుండా ఉండేందుకు కూడా టిప్స్ ఏంటన్న డౌటా..? ఈ 7 ఆహార పదార్థాలేంటో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-09-28T14:09:45+05:30 IST
స్వీట్ పొటాటో ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అందమైన చిరునవ్వు, ఆరోగ్యమైన దంతాలు ఇవి కావాలంటే కాస్త శ్రద్ధ అవసరం. నోటి శుభ్రత వల్లనే దంతాలను నాలుగు కాలాలపాటు దృఢంగా ఉంచుకోగలం. అయితే నోటి పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వల్ల దంత క్షయం చిగుళ్ల వ్యాధులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవాలి. దంతాల ఆరోగ్యం కోసం, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. శరీరం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన దంత సంరక్షణ అవసరం. ఆరోగ్యకరమైన దంతాల కోసం ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహారాలు ఏమిటో చూద్దాం...
యాపిల్..
యాపిల్ చాలా విటమిన్లు ఉన్న పండు. యాపిల్స్ పళ్లలో 'కావిటీస్'ను నివారిస్తాయి. యాపిల్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చిగుళ్ల ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.
బచ్చలికూర
ఇందులో ఉండే విటమిన్ ఎ, 'ఫోలిక్ యాసిడ్' దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి పాలకూర, బ్రకోలీ వంటి ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవచ్చు.
క్యారెట్లు
విటమిన్ ఎ, ఇతర యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న క్యారెట్ కూడా దంతాల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఏ ఆస్పత్రిలో చూసినా కిడ్నీ సమస్యలతో చేరుతున్న వాళ్లే.. అసలు కిడ్నీలు పాడవకుండా ఉండాలంటే..!
పాలు
పాల ఉత్పత్తులు.. పాలు, చీజ్, పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇది దంతాల ఎనామిల్‌ను రక్షిస్తుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. పాల ఉత్పత్తులలోని పోషకాలు బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కొన్ని ఆమ్లాలను Neutralize చేస్తాయి. ఇలా చేస్తే దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
స్ట్రాబెర్రీలు,బ్లూబెర్రీస్
ఈ బెర్రీలలో ముఖ్యంగా స్ట్రాబెర్రీలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
స్వీట్ పొటాటో
ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల దంతాల ఆరోగ్యానికి కూడా మంచిది.
పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉండే గింజలను తినడం వల్ల దంతాల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి బాదం, వాల్ నట్స్ మొదలైన వాటిని డైట్‌లో చేర్చుకోవచ్చు.