Share News

Morning walk : శీతాకాలంలో మార్నింగ్ వాక్ బద్దకంగా ఉందని స్కిప్ చేస్తున్నారా.. అయితే వైద్యులు ఏం చెబుతున్నారంటే..!

ABN , Publish Date - Dec 26 , 2023 | 04:26 PM

ఆరోగ్యాన్ని ఇచ్చే ఏదైనా కూడా ఆచి తూచి అనుసరించాలి. ముఖ్యంగా ఈ చలికాలంలో ఎక్కువగా గుండె ఆగిపోవడం, ACSమరణాలు పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఉదయం పూట నడక అనేది చాలా ముఖ్యమే కానీ ఇందులో కూడా కొన్ని వయసుల వారు, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉదయపు నడకకు దూరంగా ఉండాలి.

Morning walk : శీతాకాలంలో మార్నింగ్ వాక్ బద్దకంగా ఉందని స్కిప్ చేస్తున్నారా.. అయితే వైద్యులు ఏం చెబుతున్నారంటే..!
Morning walk

ఉదయాన్నే నడవాలంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. చాలా మంది ప్రతిరోజూ వాకింగ్‌కి వెళుతూ ఉంటారు. చలికాలం రాగానే మానేస్తారు. దీని వెనుక చలికి బద్దకించి, ఉదయాన్నే లేవాలనే ఇబ్బందితో వాకింగ్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఉదయం పూట వాకింగ్ చేయడం అనేది గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా వయసుపైబడిన వారికి ఇది మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. అలాగే ACS అధికరెట్లతో చల్లని నెలలు ముడిపడి ఉన్నాయని అధ్యనాలు చెబుతున్నాయి.

ఆరోగ్యాన్ని ఇచ్చే ఏదైనా కూడా ఆచి తూచి అనుసరించాలి. ముఖ్యంగా ఈ చలికాలంలో ఎక్కువగా గుండె ఆగిపోవడం, ACSమరణాలు పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఉదయం పూట నడక అనేది చాలా ముఖ్యమే కానీ ఇందులో కూడా కొన్ని వయసుల వారు, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉదయపు నడకకు దూరంగా ఉండాలట.. వివరాల్లోకి వెళితే...

చలికాలంలో వాకింగ్ వెళ్ళేటప్పుడు ఈ విషయాలను మరిచిపోకూడదు..

1. సరైన వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు వేసుకోవాలి.

2. శరీరానని పూర్తిగా కప్పి ఉండే విధంగా చూసుకోవాలి.

3. వాకింగ్ మొదలుపెట్టిన వెంటనే వేగవంతమైన నడక మంచిది కాదు.

ఇది కూడా చదవండి: మటన్ పాయ సూప్‌ను తాగితే.. ఎముక పుష్టి పెరుగుతుందా..? దీనిని ఎలా తయారుచేయాలంటే..!


4. గుండెకు సంబంధించిన సమస్యలు,. ఆస్తమా, న్యుమోనియా ఉంటే ఉదయాన్నే నడక మంచికాదు.

5. చలికాలం వృద్ధులు నడకకు దూరంగా ఉండాలి.

6. నెమ్మదిగా నడవడం మొదలుపెట్టి వేగాన్ని పెంచాలి.

7. చల్లని వాతావరణంలో ఉదయం 8:30 నుండి 9:30 వరకూ నడిస్తే మంచిది. అదే సాయంత్రం అయితే 5 నుంచి 6 గంటల మధ్య నడకకు వెళితే మంచిది.



మరిన్ని
హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 04:26 PM