Water Bottle: ఇలాంటి బాటిల్స్‌లో నీళ్లు వేడిగానే ఉంటాయి కానీ.. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు..!
ABN , First Publish Date - 2023-11-24T14:02:09+05:30 IST
ఈ బాటిల్స్ క్లీన్ చేస్తున్నప్పుడు మాత్రం ఇబ్బంది తప్పదు. సరిగా క్లీన్ చేయని బాటిల్స్ మురికి వాసనేస్తూ ఉంటాయి.
థర్మోస్ బాటిల్స్ ఈ మధ్య కాలంలో చాలామంది వాడుతున్నారు. అయితే వీటిలో వేడి ఎక్కువ సేపు ఉంటుంది. పనితనం కూడా చక్కగా ఉంది. కానీ ఈ బాటిల్స్ క్లీన్ చేస్తున్నప్పుడు మాత్రం ఇబ్బంది తప్పదు. సరిగా క్లీన్ చేయని బాటిల్స్ మురికి వాసనేస్తూ ఉంటాయి. దీనికి సరైన పరిష్కారం గురించి తెలుసుకుందాం. థర్మోస్ క్లీనింగ్ చిట్కాలు: థర్మోస్ బాటిల్ వాడుతున్నట్లయితే వీటిలో చల్లని సాయంత్రాలు టీని, వేడినీరు, టీని ఆస్వాదించవచ్చు. దీనిలో ఇన్ట్సాల్ చేయబడిన వాక్యూమ్ సీల్ కారణంగా ఇది వెచ్చదనాన్ని కాపాడుతూ ఉంటుంది. ద్రవం ఆవిరిని బైటికి పోకుండా చూస్తుంది. చాలాసేపు వేడిగా ఉంచుతుంది. నీరు, టీ, పాలు వంటి పానీయాలు ఇందులో నిల్వ చేయవచ్చు.
ప్రయాణాల్లోనూ, ఆఫీసుల్లో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ బాటిల్స్ క్లీనింగ్ సంయంలో మాత్రం చిన్న చిన్న పొరపాట్లతో త్వరగా పాడైపోతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో థర్మోస్ బాటిల్ సంవత్సరాలుగా చెడిపోకుండా ఉండాలంటే..
ఇది కూడా చదవండి: ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు బాదం తింటే విషంతో సమానం.. ఆయుర్వేదంలో ఏముందంటే..!
వెనిగర్, బేకింగ్ సోడా
మొదటిగా అరకప్పు వైట్ వెనిగర్ వేసి, దానిపై 1 టీస్పూన్ బేకింగ్ సోడాను చల్లాలి. కొద్దిగా వేడినీరు పోసి పదినిమిషాలు అలాగే ఉంచి లోపలి భాగం పూర్తిగా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల బాటిల్లోని బ్యాక్టీరియా పోయి వాసన తగ్గుతుంది.
ఉప్పు, ఐస్ ముక్కలు..
థర్మోస్ 2 సముద్రపు ఉప్పుతో పాటు ఐస్ ముక్కలను పగలగొట్టి కలిపి కుంచెతో శుభ్రంచేయాలి. అలాగే థర్మోస్ ను శుభ్రం చేయడానికి క్లోరిన్, లేదా బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించకూడదు. ఎలాంటి కఠినమైన రసాయనాలు ఉపయోగించకూడదు. ఇవి స్టెయిన్ లెస్ స్టీల్ బాటిల్ లోపలి భాగాన్ని దెబ్బతీస్తాయి. వీటిని శుభ్రం చేయడానికి వేడినీటిని ఉపయోగించడం కూడా చేయకూడదు. వాక్యూమ్ సీల్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.