Bananas to Kiwis : అరటిపండుతో మొదలుపెట్టి కివి వరకూ అన్ని పండ్లు డి విటమిన్ లెవెల్స్‌ని ఇట్టే పెంచేస్తాయట !! ఇవి తింటున్నారా మరి..
ABN , Publish Date - Dec 23 , 2023 | 01:28 PM
ఎండ పొడ తక్కువగా ఉండటం వల్ల శరీరానికి అందే విటమిన్ డి చాలా వరకూ శరీరంలో తగ్గుతుంది. విటమిన్ డి కంటెంట్ విషయానికి వస్తే కొన్ని పండ్లను తీసుకోవడం వల్ల దీనిని సులభంగా పొందవచ్చు.
శీతాకాలం మొదలైందంటే ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ఎండ పొడ తక్కువగా ఉండటం వల్ల శరీరానికి అందే విటమిన్ డి చాలా వరకూ శరీరంలో తగ్గుతుంది. విటమిన్ డి కంటెంట్ విషయానికి వస్తే కొన్ని పండ్లను తీసుకోవడం వల్ల దీనిని సులభంగా పొందవచ్చు. ఆ ఐదు డి విటమిన్‌తో పాటు ఈ పండ్లలో ఉండే ఇతర పోషకాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది.
తీసుకోవాల్సిన పండ్లలో ముఖ్యంగా
అరటిపండ్లు:
అరటిపండ్లు ఏడాది పొడవునా దొరుకుతుంది. ఇందులో పొటాషియం, విటమిన్ డి కూడా ఉంటాయి. విటమిన్ డి స్థాయిలను పెంచడానికి అనుకూలమైన ఆహార పదార్థంగా తీసుకోవచ్చు.
జామ:
జామలో విటమిన్ డితో పాటు, 1 IU విటమిన్‌తో పాటు విటమిన్ సి విపరీతమైన మోతాదుతో ఉంటుంది. దీనిని ముక్కలుగా చేసి, జ్యూస్‌లో సలాడ్స్‌లలో తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: బ్లాక్ అయిన సైనస్ నుండి ఉపశమనం ఇచ్చే ఈ 5 యోగా భంగిమలు ప్రయత్నించి చూడండి!
అవకాడోలు:
అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన అవకాడోలు విటమిన్ డి తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. వీటిని సలాడ్‌లు, శాండ్‌విచ్‌లలో తీసుకోవచ్చు.
అత్తిపండ్లు:
అత్తిపండ్లు, తాజావి లేదా ఎండినవి, విటమిన్ డి అధికంగా ఉన్న ఈపండ్లు తీపి రుచితో ఉంటాయి. వీటిని సలాడ్‌లలో, డెజర్ట్‌లలో తీసుకోవచ్చు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.