Spinach: ఈ 3 టెక్నిక్స్‌ను ఫాలో అయితే.. వారం రోజులు దాటినా.. పాలకూర తాజాగా ఉండటం ఖాయం..!
ABN , First Publish Date - 2023-11-24T14:44:13+05:30 IST
బచ్చలి ఆకులను టిష్యూలతో తుడిచి ఫ్రిజ్ లో నిల్వచేయడం వల్ల ఎక్కవ కాలం తాజాగా ఉంటాయి.
శీతాకాలంలో పచ్చని ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని తీసుకుంటూ ఉంటాం. అయితే తాజాగా ఉండే ఆకు కూరలతో చేసిన పప్పు, చారు పులుసు లాంటివి రుచిగా, ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ ఆకులు త్వరగా కుళ్ళిపోవడం, లేదా వడిలి పోవడం వండేందుకు సరిగా ఉండవు. వీటిలో తక్కువ కాలం నిల్వ ఉండే పాలకూర ఒకటి. పాలకూర చాలా మందికి ఇష్టమైన ఆకు కూరే కాదు. ఇది రుచికి, ఆరోగ్యానికి కూడా చాలామంచిది.
అయితే బచ్చలి కూర కొద్దిరోజులు రుచిగా ఉండాలంటే మాత్రం చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.
1. బచ్చలి ఆకులను టిష్యూలతో తుడిచి ఫ్రిజ్ లో నిల్వచేయడం వల్ల ఎక్కవ కాలం తాజాగా ఉంటాయి.
2. ఇక నేరుగా ఫ్రిజ్‌లో నిల్వ చేయాలంటే మాత్రం బచ్చలికూరను ఓ గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచాలి.
ఇది కూడా చదవండి: పెరుగు తినే అలవాటున్నా.. చాలా మందికి తెలియని నిజమిది.. చలికాలంలోనే ఇలా ఎందుకవుతుందంటే..!
3. ఇలా చేయడం వల్ల కొద్దిరోజులు ఆకు పాడవకుండా ఉంటుంది.
4. ఫ్రిజ్‌లో వెజిటబుల్ క్రిస్పర్ డ్రాయర్లో బచ్చలి కూరను గాలి చొరబడకుండా ఫ్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచడం వల్ల తాజాగా ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.