Share News

White Butter: వెన్నతో ప్రయోజనాలేంటి? వెన్నను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు!

ABN , First Publish Date - 2023-11-17T20:53:23+05:30 IST

పాత కాలంలో వెన్న అనేది ఆహారంలో ఒక భాగం. వెన్న ప్రాశస్త్యం గురించిన ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది. ద్వాపరి యుగంలో శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించడం గురించి ఎన్నో కథలు కూడా ఉన్నాయి. అలాంటి వెన్న తర్వాతి కాలంలో ప్రాభవం కోల్పోయింది.

White Butter: వెన్నతో ప్రయోజనాలేంటి? వెన్నను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు!

పాత కాలంలో వెన్న (Butter) అనేది ఆహారంలో ఒక భాగం. వెన్న ప్రాశస్త్యం గురించిన ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది. ద్వాపరి యుగంలో శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించడం గురించి ఎన్నో కథలు కూడా ఉన్నాయి. అలాంటి వెన్న తర్వాతి కాలంలో ప్రాభవం కోల్పోయింది. వెన్న తినడం వల్ల కొలస్ట్రాల్ (Cholesterol) పెరిగిపోతుందని, ఊబకాయంతో (Obesity) సహా ఎన్నో రోగాలు వస్తాయని చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు. దీంతో నెమ్మదిగా వెన్న భారతీయుల ఆహార పళ్లెం నుంచి తప్పుకుంది. అయితే నిజానికి ఆరోగ్యానికి వెన్న ఎంతో మంచిది. ఇంట్లో తయారు చేసుకునే వెన్న వల్ల శరీరంలో మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది (Food and Health).


butter1.jpgమార్కెట్లో దొరికే ప్యాకెట్లలో వెన్న కాస్త పసుపుగా ఉంటుంది. అది కాకుండా ఇంట్లోనే తెల్లటి వెన్నను (White Butter) తయారు చేసుకుంటే ఎంతో మంచిది. ఇంట్లో తయారుచేసిన తెల్ల వెన్నలో పాల ప్రోటీన్లు, సంతృప్త కొవ్వులు, విటమిన్ D, విటమిన్ A ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది. వెన్న ఆహారానికి రుచిని అందించడమే కాదు.. చక్కని యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పని చేస్తుంది.


butter2.jpgజీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరచడంలో వెన్న అమోఘమైన పాత్ర పోషిస్తుంది. అలాగే చర్మం మెరుపు కోసం వెన్న ఓ మంచి ఔషదం. వెన్నలో లెసథిన్ అనే రసాయనం ఉందని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. కొవ్వులను కరిగించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కొవ్వును కరిగించే సప్లిమెంట్లలో ఈ లెసథిన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు.


butter3.jpgఇంట్లో తయారుచేసిన తెల్ల వెన్నని తక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల బరువు (Weight Reduction) తగ్గవచ్చు. అంతేకాదు వెన్నలో ఉండే సంతృప్త కొవ్వులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే రోజులో రెండే టీ స్పూన్లకు మంచి వెన్నను (Makhan) తీసుకోకూడదు.


butter4.jpgపాల నుంచి ప్రతిరోజూ మీగడను సేకరించి స్టోర్ చేసుకోవాలి (White Butter Recipe). రెండు, మూడు కప్పుల మీగడను సేకరించిన తర్వాత దానిని ఓ పెద్ద పాత్రలో వేసి దానికి ఐస్ వాటర్ కలపాలి. ఆ తర్వాత ఆ ద్రవం మొత్తాన్ని కవ్వంతో చిలకాలి. కొద్దిసేపటికి ఆ ద్రవం నుంచి వెన్న సెపరేట్ అవుతుంది. దానిని 30 నిమిషాల పాటు వేరుగా ఉంచితే వెన్న గట్టిగా తయారవుతుంది.

Updated Date - 2023-11-17T20:53:29+05:30 IST