Divorce: పెళ్లయిన మగాళ్లు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయమిది.. ఆ నిర్ణయానికి ముందు ఈ 4 ప్రశ్నలు వేసుకుంటే..!
ABN , First Publish Date - 2023-07-18T16:09:23+05:30 IST
విడాకులు తీసుకోవడం అనే విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా కాస్త ఆలోచించాలి.
వివాహం ఇద్దరిని ఒకటిగా చేయడమే కాదు, రెండు కుటుంబాల సంస్కృతిని, సాంప్రదాయాలను కలుపుతుంది. ఇద్దరూ ఒకే మాటమీద జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే విడాకులు తీసుకోవడం అనే విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా కాస్త ఆలోచించాలి. చాలాసార్లు మగవారు తొందరపడి నిర్ణయానికి వస్తారు. దీని కారణంగా తర్వాతి పరిణామాలు భరించవలసి వస్తుంది. అందుకే భార్యతో విడిపోయే ముందు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. పెళ్ళికి అంగీకారం తెలిపినప్పుడే భాగస్వామి గురించి తెలుసుకోవడం అనేది అందరి విషయంలోనూ సాధ్యం కాని విషయం. కాకపోతే చాలా మంది కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లనో, ఇతర స్నేహితుల వల్లనో పెళ్లి చేసుకుంటారు. ఆపై అలాంటి వివాహాలు విడాకుల వరకూ చేరుకుంటాయి.
అనుకోని విధంగా రిలేషన్ నుంచి తప్పుకుంటూ విడాకులు తీసుకోవడం అంటే జీవితం విచ్ఛిన్నమవుతుంది. కనుక పెళ్ళి అనే ఆలోచనను తీసుకునేప్పుడే ఎదుటి వ్యక్తి మనస్తత్వానికి తగిన విధంగా మసులుకునే ఓపిక ఉండాలి. మన జీవితంలోకి వచ్చే స్త్రీ ఎలా అనుకూలంగా ఉండాలని కోరుకుంటామో అంతకన్నా అనుకూలమైన విధంగా మనల్ని మనం మార్చుకోవాలి. అయితే పెళ్ళి చేసుకోవడం చాలా ముఖ్యమైన నిర్ణయం అని గుర్తుంచుకోవాలి. ఇది ఇద్దరి మనసులను ప్రేమ, కుటుంబంతో మాత్రమే కాకుండా రెండు జీవితాలను పెనవేసే ప్రక్రియ. కనుక వివాహానికి సిద్ధం కావడం అంటే ప్రేమ, కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేయడమే కాకుండా ఇది చట్టపరమైన హక్కులు, బాధ్యతలను కూడా నిర్థారిస్తుంది.
భార్య నుండి విడాకులు తీసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే, ఎందుకు విడిపోవాలి?
తప్పును సరిదిద్దుకోవడానికి భార్యకు అవకాశం ఇచ్చానా?
మగవాళ్ళకి ఉన్న అతి పెద్ద చెడు అలవాటు ఏమిటంటే మనసులో మాటలను బహిరంగంగా పంచుకోరు. కొన్నిసార్లు భార్యతో హాయిగా కూర్చుని తమ బంధం గురించి గానీ, కుటుంబంలోని సమస్యల గురించి గానీ మాట్లాడరు. ఈ పరిస్థితిలో, ఆమె తప్పును సరిదిద్దడానికి అవకాశం ఇవ్వకుండా భార్యనుంచి విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటే, మళ్లీ ఆలోచించండి.
ఇది కూడా చదవండి: చాలా మందికి ఇష్టం ఉండని ఈ కూరగాయతో.. తెల్ల జుట్టుకు చెక్ పెట్టొచ్చట.. ఎలా వాడాలంటే..!
వివాహ బంధాన్ని కాపాడుకోండి.
వాస్తవానికి సంబంధాన్ని చాలాసార్లు కాపాడుకోవడానికి ప్రయత్నించి, ప్రతిసారీ విఫలమైతే, మాత్రం విడాకులు జీవితంలో తప్పు కాదు. కానీ దీనికి విరుద్ధంగా చేయడం వలన జీవితంలో తర్వాత పశ్చాత్తాపపడవలసి రావచ్చు.
పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.
తండ్రి అయిన తర్వాత విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటే, అది వ్యక్తిగత విషయం కాదు. ఇది పిల్లల జీవితానికి సంబంధించిన ప్రశ్న కూడా. ముఖ్యంగా పిల్లలు పెరుగుతున్నప్పుడు ఇది ఇంకా పెద్ద సమస్య. అందువల్ల, భార్యతో విడాకులు తీసుకునే ముందు, పిల్లలపై దాని ప్రభావం గురించి జాగ్రత్తగా ఆలోచించండి.