Dried Lemons: నిమ్మకాయలు ఎండిపోయాయి కదా అని పారేస్తున్నారేమో.. వాటితో కూడా ఇన్ని లాభాలున్నాయని తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-06-27T14:46:09+05:30 IST
పాత్రలలో జిగటగా, నూనె పేరుకుని, ఏదైనా వండినప్పుడు, పాత్రలపై జిగట పేరుకుపోతుంది.
వేసవి కాలంలో నిమ్మకాయలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిమ్మరసం తాగితే శరీరం చల్లబడి హాయిగా ఉంటుంది. అలాగే నిమ్మరసం అనేక పానీయాలు, రసాలలో అవసరమైన పదార్ధంగా ఉపయోగిస్తారు. తాజా నిమ్మకాయతో ప్రయోజనాలు, దానిని ఎలా ఉపయోగించాలనేది దాదాపు అందరికీ తెలుసు. ఇంట్లో అవసరానికంటే ఎక్కువగా ఉన్న నిమ్మాకాయలు ఫ్రిజ్ లో ఉంచినా సరే కొద్దిరోజులకే రంగుమారి పాడవుతూ ఉంటాయి.
ఇలాంటి వాటిని ఎలా ఉపయోగించాలో తెలియక పారేస్తూ ఉంటాం. నిజానికి, ఎండిన నిమ్మకాయల నుండి రసం సులభంగా రాదు. ఒకవేళ తీసినా కూడా అది అంతంత మాత్రమే. నిమ్మకాయలు ఒకటి నుండి 2 వారాల్లోనే ఎండిపోతాయి. ఎండిన నిమ్మకాయలు బయట నుండి గట్టిపడతాయి. ఎండిన తర్వాత నల్లగా కనిపిస్తాయి, కాబట్టి వాటిని ఉపయోగించకుండా, వాటిని డస్ట్‌బిన్‌లో వేస్తూ ఉంటారు. కానీ, నిమ్మకాయ ఆరిపోయాక పారేస్తే పొరపాటే. ఎందుకంటే ఎండిన నిమ్మకాయలను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.
ఎండిన నిమ్మకాయను ఎలా ఉపయోగించాలి.
వీటితో ఇంటిని తళతళలాడేలా మార్చేయవచ్చు. చాపింగ్ బోర్డ్ ని మెరిసేలా చేయచ్చు, ఇంటి మూలలను పాడైన నిమ్మకాయలతో శుభ్రం చేయచ్చు. పాత్రలకు ఉన్న జిడ్డు, మురికిని ఈ నిమ్మాకాయలతో తుడిచి శుభ్రం చేయవచ్చు.
ఇది కూడా చదవండి: ఈ 8 టిప్స్‌ను పాటించండి చాలు.. 50 ఏళ్లొచ్చినా 25 ఏళ్ల వయసులాగానే కనిపించడం ఖాయం..!
కత్తిరించే బోర్డు శుభ్రం చేయడానికి
ఎండిన నిమ్మకాయలను కూరగాయలు కత్తిరించే బోర్డులను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. కూరగాయలు, పండ్లు మొదలైనవి కత్తిరించే బోర్డు మీద మరకలను సబ్బుతో శుభ్రం చేయడమే కాకుండా నిమ్మకాయతో కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఎండిన నిమ్మకాయలు సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తాయి. చాపింగ్ బోర్డ్‌ను మెరిసేలా చేస్తాయి. చాపింగ్ బోర్డ్‌పై తేలికపాటి ఉప్పు వేసి, ఆపై నిమ్మకాయతో రుద్ది శుభ్రం చేయండి.
పాత్రలను శుభ్రం చేయండి.
పాత్రలలో జిగటగా, నూనె పేరుకుని, ఏదైనా వండినప్పుడు, పాత్రలపై జిగట పేరుకుపోతుంది. ఈ జిడ్డు పాత్రలను కడగడానికి కూడా నిమ్మకాయను ఉపయోగించవచ్చు.
క్లినిక్ ఏజెంట్
ఇంటి ఫ్లోర్, వాల్ టైల్స్, కిచెన్ టాప్ శుభ్రం చేయడానికి కూడా ఎండు నిమ్మకాయలు ఉపయోగపడతాయి. వీటి నుంచి ఇంట్లోనే క్లీన్ ఏజెంట్‌ను తయారు చేసుకోవచ్చు. దీనికి పొడి నిమ్మకాయను కట్ చేసి, ఉప్పు కలపండి. దానికి నీరు కలిపి కాసేపు ఉడకబెట్టండి. చల్లబరచి శుభ్రం చేయడానికి ఉపయోగించండి. దీనితో ఇంట్లో ప్రతి మూల మెరుస్తుంది.