Vastu Tips For Home: తులసి మొక్కకు రోజూ నీళ్ళు పోస్తున్నారా? అయితే చాలా నష్టపోతారు..!
ABN , First Publish Date - 2023-03-15T09:42:53+05:30 IST
ఎండిన తులసి మొక్కను ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు.
దక్షిణ, నైరుతి మధ్య మండలాన్ని సౌత్ వెస్ట్ జోన్ అంటారు. జీవితంలో అనుకోని ఖర్చులు వచ్చి పడ్డాయంటే దానికి మనం చేసే చిన్న చిన్న వాస్తు తప్పులు కూడా కారణం అంటున్నారు వాస్తు నిపుణులు. మరిలాంటి తప్పిదాలు జరగకుండా అనుకోని ఖర్చులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే..
ఉదయం పూజ సమయంలో తులసి మొక్కను కూడా పూజిస్తూ ఉంటాం. హిందూమతంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్కలోని ఆయుర్వేద గుణాలు మనందరికీ తెలుసు. మామూలుగా మన ఇళ్ళల్లో తులసి మొక్కను చూస్తూనే ఉంటాం. ప్రతిరోజు ఉదయం పూజ సమయంలో తులసి మొక్కను కూడా పూజిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం తులసికి నీరు పెట్టకూడని రోజులు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా.
ఇది కూడా చదవండి: ప్రపంచం మొత్తం ఇదే సమస్యతో పోరాడుతుంది. ఈ ఊబకాయాన్ని నియంత్రించే మందే లేదా..?
తులసికి ఎప్పుడు నీళ్ళు సమర్పించకూడదు.
వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతి ఆదివారం, ఏకాదశి, సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో తులసికి నీరు సమర్పించకూడదు. అలాగే ఈ రోజుల్లోసూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తీయకూడదు. అలా చేయడం అపరాధానికి దారి తీస్తుంది. వాస్తు ప్రకారం, గురువారం నాడు తులసి మొక్కకు పచ్చి పాలు పోసి, ఆదివారం తప్ప ప్రతి రోజూ సాయంత్రం నెయ్యి దీపం వెలిగించిన వ్యక్తి ఇంట్లో లక్ష్మీ పరిమళం ఉంటుంది.
పొడి తులసి మొక్క ఇంట్లో ఉండకూడదు.
ఇది కాకుండా, పొడి (ఎండిన) తులసి మొక్కను ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. ఇది అశుభమైనదిగా పరిగణిస్తారు. అలాంటి మొక్కను బావిలో లేదా పవిత్ర స్థలంలో ఉంచి కొత్త మొక్కను నాటాలి. వాస్తు శాస్త్రంలో ఈ చిట్కాలను అనుసరించడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు.