Share News

Children : పిల్లలు మరీ పెంకిగా మారుతుంటే ఈ లక్షణాలు వాళ్ళలో తప్పక ఉంటాయి.. తల్లిదండ్రులు గమనించారా?

ABN , First Publish Date - 2023-10-21T14:05:25+05:30 IST

ఒత్తిడి చదువులతో పిల్లల ధోరణిలో మార్పును గమనించారా? పెంకితనంగా ఎందుకు మారుతున్నారు.

Children : పిల్లలు మరీ పెంకిగా మారుతుంటే ఈ లక్షణాలు వాళ్ళలో తప్పక ఉంటాయి.. తల్లిదండ్రులు గమనించారా?
challenges

పిల్లల భవిష్యత్ గురించి కలలు కనే ప్రతి తల్లితండ్రులు ఉన్నదాంట్లో బిడ్డను చక్కగా చూసుకోవాలి అనుకుంటారు. దానికోసం కష్టపడతారు. అయితే ఇప్పటి పిల్లలు కాస్త పెంకితనం, మొరటుతనంతో పాటు, ముదిరిన తెలివితేటలతో కొరకరాని కొయ్యలుగా తయారయ్యారు. దీనికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే. చదువుల ఒత్తిడిలో పిల్లలు కూడా సతమతమవుతూ ఉన్నరనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. వాళ్ళకు సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి. సవాళ్లను ఎదుర్కోకుండా పిల్లలను రక్షించే పేరెంటింగ్ విషయాలను గురించి తెలుసుకుందాం.

తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా పాంపరింగ్ చేయడం వల్ల పాడు చేస్తారు. అలాంటి పిల్లలను స్వార్థపరులుగా, అసంతృప్తిగా ఉన్న పెద్దలుగా మారతారు. ప్రతి దానికి మారాం చేయడం, కావాల్సింది దొరకనపుడు పెంకిగా ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు. దీనికి తల్లి తండ్రులు చెప్పే సమాధానం మాటవినకపోవడం,, ఇంతవరకూ బాగానే ఉంది కానీ,, వయసు పెరిగే కొద్దీ తల్లితండ్రులు చెప్పే ఏ మాటా వారికి విలువగా అనిపించకపోవడం వరకూ పరిస్థితి వెళుతుంది. దీనికి ఏంచేయాలంటే..

పిల్లలు తమకు కావలసినది పొందాలని కోరుకుంటారు. ఈ విషయంలోనే తల్లిదండ్రులు సమతుల్య పద్ధతిలో ఆలోచించాలి. బిడ్డకు ప్రతిదానికీ అవును అని చెబితే, వారు చెడిపోవచ్చు. థ్యాంక్యూ, ప్లీజ్ లాంటి మాటలు ఎలా చెప్పాలో కూడా వారికి తెలియదు. చేసే ప్రతి పని మీదా బాధ్యతగా ఉండే విధంగా చూడాలి.

ఇది కూడా చదవండి: ఈ మొక్కగానీ ముట్టుకున్నారో అంతే.. ఇక తిన్నారంటే ప్రాణాలే పోతాయ్.. పొరపాటున కూడా అటుపోకండి.!


ఒంటరిగా ఉండటం, పదే పదే జరిగిన వాటి గురించే ఆలోచించే ధోరణి ఉన్న పిల్లల్ని నలుగురిలో కలిసే విధంగా మార్చాలి. చదువు, ఆటలు కాకుండా మిగతా విషయాల్లో ప్రోత్సహించాల్సింది.. స్నేహితులతో కలిసి మెలిసి ఉండే విధంగా చూడాల్సింది కూడా తల్లితండ్రులే.. స్కూల్ వాతారవణంలో కూడా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు కలిపి శ్రద్ధ చూపిస్తే పెంకిగా ఉండే పిల్లల్లో మార్పు వస్తుంది. నలుగురితో చలాకీగా తిరిగి, ఆలోచనలను, అవసరాలను తెలిసేలా ఎదుగుతారు.

తల్లిదండ్రులు ఏమి చేయాలి?

పిల్లల్ని వాళ్ల ధోరణిలో వదిలేయకుండా, ప్రతి విషయంలో వాళ్ల అభిరుచిని, ఇష్టాఇష్టాలను గమనిస్తూ ఉండటం ముఖ్యం. చదువు, ఆటపాటల విషయంలోనే కాదు. నలుగురితో మసిలే విధానంలో కూాడా పిల్లల ధోరణి గమనించడం, చిన్న వయసు నుంచే వారిని సరైన దారిలో ఉంచే విధంగా ప్రోత్సహించడం తల్లితండ్రుల ప్రధాన కర్తవ్యం. ఒంటరిగా చదువుల ఒత్తిడిలో ఉన్న పిల్లలకు కూడా తల్లితండ్రుల మాటలే ఊరటనిచ్చేలా చేస్తాయి. స్కూల్ తర్వాత ఇంటి వాతారవణం కాస్త ఒత్తిడి లేనిదిగా మార్చి పిల్లలతో సమయం గడిచేలా ఫ్లాన్ చేసి చూడండి.

Updated Date - 2023-11-03T15:20:45+05:30 IST