Krishnadevaraya Dog: నిశ్శబ్ధ శునకం
ABN , First Publish Date - 2023-06-13T04:02:07+05:30 IST
కృష్ణదేవరాయలు దగ్గర కొలువులో ఉన్న కవి తెనాలి రామలింగడు. ఆయన రచనతో పాటు హాస్యం ఒలికించటంలో, ఎలాంటి కష్టాన్నయినా సులువుగా పరిష్కరించటంలో దిట్ట. ఎలాంటి సమస్యలనైనా సులువుగా సమాధానం చెప్పగల మేధావి.
కృష్ణదేవరాయలు దగ్గర కొలువులో ఉన్న కవి తెనాలి రామలింగడు. ఆయన రచనతో పాటు హాస్యం ఒలికించటంలో, ఎలాంటి కష్టాన్నయినా సులువుగా పరిష్కరించటంలో దిట్ట. ఎలాంటి సమస్యలనైనా సులువుగా సమాధానం చెప్పగల మేధావి. ఆయన ఒక రోజు దారింటా వెళ్తుంటే చిన్న కుక్కపిల్ల కనపడింది. భోరున వర్షం. ఆ వర్షానికి ఒక మట్టిగోడ కింద పడుకుని అరుస్తోన్న ఆ కుక్కపిల్లను చూసి రామలింగడు చలించాడు. దాన్ని అక్కున చేర్చుకుని ఇంటికి తీసుకెళ్లాడు. తన కుటుంబ సభ్యులకు ఇది మన కుటుంబంలో ఒకటి అని చెప్పాడు. అందరూ దాన్ని ప్రేమతో చూసుకునేవాళ్లు.
ఇంట్లో ప్రేమ ఎక్కువ అవ్వటం, మంచి తిండి, కంటికి నిద్ర ఉండే ఆ కుక్కపిల్ల పెరిగి పెద్దదైంది. ఆ శునకంకు ప్రత్యేక గౌరవం దక్కేది. రాజుగారి దగ్గరకు పోయినా దానికి విలువ ఇచ్చేవారు ఇతరులు. సైనికులు తన ఇంటి దగ్గరకు పని మీద వచ్చినపుడు ముద్దాడేవాళ్లు. అది చూసి ఆ శునకానికి కాస్త పొగరు ఎక్కువైంది. ఏమి చేసినా ఎవరూ ఏమనరు అనే గర్వం తనలోకి వచ్చింది. అయినా ఎక్కడా బయటపడేది కాదు.
ఒక రోజు ఓ రహస్య పనిమీద రాయలవారితో ఓ నది మార్గాన కలసి పడవలో వెళ్తున్నారు తెనాలి రామలింగడు. ఆ రోజు ఆయన వెంట తన శునకాన్ని కూడా తెచ్చాడు. ‘రాజావారు.. ఈ శునకం మంచిది. అరవదు. ఎవరికీ హాని చేయదు’ అన్నాడు. అంత అందంగా ఉండే శునకం చూసి దాన్ని పలకరించాడు. నదిలోకి కొంత దూరంలోకి వెళ్తూనే.. ఆ శునకం కావాలనే గట్టిగా అరుస్తోంది. అసలే రాజావారు పడవలో ఉన్నారు. రహస్యంగా వెళ్తున్నారు. ఆ శునకం మొరిగే శబ్దం చూసి రాజుగారు, ఇతర సైనికులకు కోపం వచ్చింది. అరవొద్దు అని సైగలు రామలింగడు చేశాడు. అయినా అరుపు రెట్టింపు చేసింది. దానికి రాజుగారు ఎవరనే విషయం తెలీదు.. కదా అందుకే అరుస్తోందేమో అన్నాడు రాయలవారు. క్షణంలో ఆ శునకాన్ని ఎత్తుకుని ఆ నీళ్ల మధ్యలో విసిరేశాడు రామలింగడు. ఆ శునకం ప్రాణభయంతో బలంగా ఈత కొడుతోంది. కొద్ది సేపటి తర్వాత ఆ శునకాన్ని దగ్గరగా తీసుకున్నాడు రామలింగడు. ఆ క్షణం నుంచి ఆ శునకం అరవలేదు. మౌనంగా ఉంది. ఆ నిశ్శబ్ధం చూసి రాయలవారు ఫక్కున నవ్వారు.