Hippopotamus: వేగంలో పోటీపడలేం

ABN , First Publish Date - 2023-08-01T02:54:03+05:30 IST

చూడ్డానికి భారీగా... కదల్లేనట్టు కనిపించే హిప్పోపోటమస్‌ (నీటి గుర్రం) నిజానికి చాలా చురుకైన జంతువు.

Hippopotamus: వేగంలో పోటీపడలేం

చూడ్డానికి భారీగా... కదల్లేనట్టు కనిపించే హిప్పోపోటమస్‌ (నీటి గుర్రం) నిజానికి చాలా చురుకైన జంతువు. ఇవి నేల మీదే కాదు... నీటిలోనూ హాయిగా జీవించగలవు. ఉభయచర జీవులు. ఇవి శాకాహారులు. నీటిలోనే పిల్లలను కంటాయి. పుట్టిన కొద్దిసేపటికే పిల్లలు ఈత నేర్చుకుంటాయి. నీటి గుర్రం జీవిత కాలం యాభై నుంచి అరవై సంవత్సరాలు. ఒక సాధారణ హిప్పో బరువు పదిహేను నుంచి పద్ధెనిమిది వందల కేజీలు. అందులో 18 శాతం బరువు చర్మమే ఉంటుంది. విశేషమేమంటే హిప్పోలు మనిషి కంటే వేంగంగా (గంటకు 30 మైళ్లు) పరుగెత్తగలవు. ఇంకా చెప్పాలంటే స్టార్‌ స్ర్పింటర్‌ ఉస్సేన్‌ బోల్ట్‌ కంటే వేగంగా! అతని గరిష్ట వేగం గంటకు 23.4 మైళ్లు. వీటి బాడీ ఫ్యాట్‌ (కొవ్వు) శాతం మానవుల కంటే ఎన్నో రెట్లు తక్కువ.

Updated Date - 2023-08-01T02:54:03+05:30 IST