American Kestrel: మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-06-01T23:17:13+05:30 IST

అమెరికన్‌ కెస్ట్రల్‌ ఉత్తర అమెరికాలోనే చిన్న పక్షి. మగపక్షులు నీలం, బూడిద రంగులతో అందంగా ఉంటాయి. ముఖ్యంగా కెస్ట్రల్‌ పక్షులు మిడతలు, తూనీగలు, బల్లులు, చిన్నపాములు, పురుగులు.. లాంటి వాటిని తిని జీవిస్తాయి.

American Kestrel: మీకు తెలుసా?

అమెరికన్‌ కెస్ట్రల్‌ ఉత్తర అమెరికాలోనే చిన్న పక్షి. మగపక్షులు నీలం, బూడిద రంగులతో అందంగా ఉంటాయి. ముఖ్యంగా కెస్ట్రల్‌ పక్షులు మిడతలు, తూనీగలు, బల్లులు, చిన్నపాములు, పురుగులు.. లాంటి వాటిని తిని జీవిస్తాయి.

గాల్లో విమానంలా దూసుకెళ్తుంది. గంటలపాటు ఓపెన్‌ ఏరియాలో ఎగురుతూ, కిందకు ఆహారం కోసం చూస్తూ వేచిచూస్తుంటాయి. ఆహారం కనపడగానే రాకెట్‌లా దూసుకెళ్తాయి.

శరీరం 8 ఇంచుల నుంచి 12 ఇంచులు ఉంటుంది.

బరువు గరిష్టంగా 170 గ్రాములు ఉంటుంది. వీటి వింగ్‌ స్పాన్‌ 60 సెం.మీ. గంటకు 39 కి.మీ. వేగంతో దూసుకెళ్తాయి. ఇవి తక్కువ వెలుతురులోనూ బాగా చూడగలవు.

1969లో ఓ హాలీవుడ్‌ చిత్రంలో ప్రధాన పాత్రగా నటించిన ఓ బాలుడు ఈ పక్షికి శిక్షణ ఇస్తాడు. అలా ఈ పక్షి జాతి షూటింగ్‌లో కూడా పాల్గొంది.

ఇవి స్వతహాగా చెట్లలో గూళ్లు కట్టుకోలేవు. ఉడ్‌ కీపర్స్‌, కాకులు, ఇతర పెద్ద పక్షులు వదిలేసిన గూటిలో నివాసముంటాయి. మూడు నుంచి ఆరు గుడ్ల వరకూ పెడతాయి. ఈ గుడ్లను కనీసం 30 రోజులు పొదుగుతాయి.

పిచ్చుకలు, అమెరికన్‌ కెస్ట్రల్స్‌ గాలిలో ఎగురుతుంటే గుర్తుపట్టడం చాలా కష్టం. చల్లని ప్రాంతాల్లో నివసించటానికి ఆసక్తి చూపిస్తాయి.

ఇవి ఎగ్జయిట్‌గా ఉన్నపుడు, బాధతో ఉన్నప్పుడు కిల్‌, కిల్‌.. అంటూ అరుస్తాయి.

తలమీద నల్లటి చుక్కలు ఉండటం వల్ల ఇతర పెద్ద పక్షులను కన్‌ఫ్యూజ్‌ చేస్తావి.

అమెరికాలో వీటి జాతి 17 రకాలున్నాయి. ఇకపోతే వీటి జీవనకాలం కేవలం 5 ఏళ్లు.

Updated Date - 2023-06-01T23:17:13+05:30 IST