Bacterian Camels : మీకు తెలుసా?
ABN , First Publish Date - 2023-11-23T23:32:07+05:30 IST
మంగోలియాలోని గోబి ఎడారిలో ఉండే ఈ ఒంటెలు ప్రత్యేకం. వీటిని బాక్టిరియన్ ఒంటెలు అని పిలుస్తారు. ఇసుకరంగు, గోధుమ రంగులో ఉంటాయి.
మంగోలియాలోని గోబి ఎడారిలో ఉండే ఈ ఒంటెలు ప్రత్యేకం. వీటిని బాక్టిరియన్ ఒంటెలు అని పిలుస్తారు. ఇసుకరంగు, గోధుమ రంగులో ఉంటాయి. వీటి పైన రెండు మోపురాలు ఉంటాయి. పాలిచ్చే జంతువుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద జంతువులివి. కేవలం మధ్య ఆసియాలోనే ఉంటాయి.
పచ్చిక, ఆకులు, పూలు, బెరడు, గింజలు తిని బతుకుతాయి.
ఎడారిలో నడిచేప్పుడు ఇసుక తుఫానులనుంచి రక్షించుకునే నిర్మాణం వీటి కాళ్లకు ఉంటుంది. అదే విధంగా వీటి గిట్టల ఆకృతి ఇసుకలో వేగంగా పరిగెత్తేందుకు వీలుగా ఉంటుంది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి.
హంప్ దగ్గర చూస్తే ఏడు ఫీట్ల ఎత్తు ఈ ఒంటెలు ఉంటాయి.
పుట్టిన గంటల్లోనే ఒంటె పిల్లలు ఇసుకలో పరిగెత్తగలవు.
వీటిని పెంచుకోవచ్చు. 40 డిగ్రీల వేడిలోనూ.. మైనస్ 30 డిగ్రీల చలిలోనూ జీవిస్తాయి.
ఇవి ఒకసారి కనీసం 56 లీటర్ల నీటిని తాగుతాయి. మీకో విషయం తెలుసా.. ఉప్పు నీళ్లను సైతం తాగినా వీటికి ఎలాంటి ఇబ్బంది కలగదు.
ఆడ ఒంటెలు 300 కేజీలనుచం 1000 కేజీల బరువు ఉంటాయి. మగ ఒంటెలు 600 కేజీలు ఉంటాయి. ఇవి సులువుగా 250 కేజీలు బరువును మోస్తాయి.
శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం కనీసం 3,50,00 ఏళ్ల కింద నుంచి వీటి ఆనవాళ్లు ఉన్నాయి.
ఇవి కనీసం నలభై ఏళ్ల వరకూ జీవిస్తాయి.