Black-faced spoonbill: మీకు తెలుసా?
ABN , First Publish Date - 2023-08-17T03:01:23+05:30 IST
కొంగ జాతికి చెందిన ఈ పక్షిని బ్లాక్ ఫేస్డ్ స్పూన్ బిల్ అని పిలుస్తారు. దీని ముక్కు అచ్చు స్పూన్‌లా ఉంటుంది కాబట్టి దీన్ని స్పూన్ బిల్ అంటారు.
కొంగ జాతికి చెందిన ఈ పక్షిని బ్లాక్ ఫేస్డ్ స్పూన్ బిల్ అని పిలుస్తారు. దీని ముక్కు అచ్చు స్పూన్‌లా ఉంటుంది కాబట్టి దీన్ని స్పూన్ బిల్ అంటారు.
తూర్పు ఆసియా, దక్షిణ కొరియా, హాంకాంగ్, జపాన్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో ఇవి కనిపిస్తాయి.
1990 ల్లో ఇవి 288 మాత్రమే ఉండేవని సర్వేలు చెప్పాయి. ఇపుడు వీటి ఆరువేలు ఉన్నాయి. మళ్లీ వీటి సంఖ్య తిరోగమనం వైపు వెళుతోదింది. ముఖ్యంగా కాలుష్యం, సముద్ర కాలుష్యం వల్ల ఈ జీవులు అంతరించిపోతున్నాయి.
ఇవి కేవలం సముద్రతీర ప్రాంతాల్లో తిరగాడే నీళ్ల పక్షులు. వీటితో పాటు తడినేలలు, బురద ప్రాంతాల్లో తిరగాడుతుంటాయి.
ఇవి గుంపులుగా ఉంటాయి. చేపలు వీటికి ప్రధాన ఆహారం.
76 సెం.మీ. ఎత్తు కలిగి ఉండే ఈ పక్షి బరువు సుమారు కేజీ ఉంటుంది.
ఈ ఫ్లాట్ ముక్కు చైనా వస్తువు పీపాలా ఉంటుంది. ఇవి చిన్నపుడు లైట్ పింక్ రంగులో కనిపిస్తాయి. పెద్దయ్యాక తెలుపు రంగులో ఉంటాయి.
వేగంగా ఈదగలవు. అడవిపిల్లులు, గద్దలు బారినపడకుండా గాల్లో వేగంగా ఎగరగలవు.
వియత్నాం, చైనా లాంటి దేశాల్లో ఇవి నివసించే ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వాలు నిబంధనలు తెచ్చాయి.