Clever Cock : తెలివైన కోడిపుంజు

ABN , First Publish Date - 2023-08-02T23:50:45+05:30 IST

ఒక అడవిలో ఓ కోడి పుంజు ఉండేది. అది ముందు ఏదైనా చెడు ఆలోచించిన తర్వాత మంచి ఆలోచించేది. అలాంటి గుణం వల్ల ఆ కోడిపుంజు ఎవరితో కలిసేది కాదు. అదే అడవిలో ఓ నక్క ఉండేది. నక్కకు కూడా ఎవరూ

Clever Cock : తెలివైన కోడిపుంజు

ఒక అడవిలో ఓ కోడి పుంజు ఉండేది. అది ముందు ఏదైనా చెడు ఆలోచించిన తర్వాత మంచి ఆలోచించేది. అలాంటి గుణం వల్ల ఆ కోడిపుంజు ఎవరితో కలిసేది కాదు. అదే అడవిలో ఓ నక్క ఉండేది. నక్కకు కూడా ఎవరూ మిత్రులు లేరు. ఎప్పుడూ సింహం, పులి తిన్న ఆహారంలో మిగిలిన ఆహారం తినటమేనా? అనుకుంది. తాజా మాంసాహారం సొంతంగా సంపాదించుకోవాలని పూనుకుంది. దీంతో అడవిలో రోజుకో జంతువును తినాలనే ఆశ దానికి పట్టుకుంది.

ఒక రోజు నక్క దారిన వెళ్తోంది. ఓ జింకపిల్ల ఎదురుగా వస్తోంది. అయ్యో.. మందలో తప్పిపోయావా? అంటూ ప్రేమగా మాట్లాడింది. దీంతో ఆ అమాయక జింక నమ్మింది. తన ఇంటికి చేర్పమని వేడుకుంది. సరేనంటూ తీసుకెళ్తూ పొదలు వచ్చిన తర్వాత దాని గొంతు కొరికి చంపేసింది. ఆ తర్వాత కుందేళ్లనూ మాయమాటలు చెప్పి తినేసింది. పావురం లాంటి పక్షి కూడా నక్క మాటలకు పడిపోయింది. ప్రాణాలు పోగొట్టుకుంది. ఒక రోజు నక్క వెళ్తూ ఉంటే కోడిపుంజు కూత చెట్టుమీద నుంచి వినపడింది. ఇదేదో కొత్త జీవి. దీన్ని తినేయాలి అనుకున్నది. కోడిపుంజు చెట్టుమీద కనపడింది. కిందనుంచి కోడిపుంజును పరిచయం చేసుకుంది నక్క. ‘నీలాంటి జీవిని చూడలేదే’ అన్నది నక్క. ‘‘అవును మేం మనుషులతో ఉంటాం. ఊరు నచ్చక అడవిలో ఉంటున్నా’ అన్నది కోడిపుంజు. కిందకి దిగు.. మనం మిత్రులం ఈరోజు నుంచి అన్నది నక్క. కోడిపుంజు ఇలా అన్నది.. ‘కిందకి వస్తే తినేయాలని ఉన్నావు’ అన్నది. ‘అబ్బే.. నేను మాంసాహారం తినను’ అన్నది. కోడిపుంజు చెట్టు పైనుంచి దిగలేదు. దిగకపోతే కిందకు వచ్చేవరకు చూస్తా.. నీ అంతు చూస్తానంటూ బెదిరించింది నక్క. కోడిపుంజు ఒక్కసారిగా కొక్కొరోకో.. అంటూ కూత వేసింది. ఓ కుక్క అతి వేగంగా దూసుకొచ్చింది. క్షణాల్లో నక్కకు కళ్లు బైర్లు కమ్మాయి. కుక్క చంపేస్తుందని భయపడి ప్రాణాలను నిలబెట్టుకుంది నక్క. కోడిపుంజు తెలివి చూసి అడవి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి.

Updated Date - 2023-08-02T23:50:45+05:30 IST