Bird Stock : మీకు తెలుసా?
ABN , Publish Date - Dec 15 , 2023 | 05:42 AM
నల్లటి రెక్కలు తెల్లగా ఉండి పొడవైన ముక్కు ఉండే ఈ పక్షిని ‘స్టాక్’ అని పిలుస్తారు. ఇవి కొంగలు, ఫ్లెమింగో జాతికి చెందినవి. కనీసం వీటిలో ఇరవై
నల్లటి రెక్కలు తెల్లగా ఉండి పొడవైన ముక్కు ఉండే ఈ పక్షిని ‘స్టాక్’ అని పిలుస్తారు. ఇవి కొంగలు, ఫ్లెమింగో జాతికి చెందినవి. కనీసం వీటిలో ఇరవై రకాల జాతులు ఉన్నాయి.
ఆఫ్రికా, ఆసియా, యూరప్ ఖండాల్లో వీటి సంతతి అధికం. యూర్‌పలో గుడ్లు పెట్టి పిల్లలయ్యాక వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆసియా, ఆఫ్రికా ఖండాలకు ప్రయాణిస్తాయి. ఒక చోట నుంచి మరొక చోటుకు వెళ్లటానికి ఇష్టపడతాయి.
రెండు నుంచి ఐదు ఫీట్ల పొడవు ఉంటాయి. వీటి వింగ్ స్పాన్ 7 ఫీట్లు. ఎత్తు 25 సెం.మీ. బరువు రెండున్నర కేజీల నుంచి నాలుగున్నర కేజీలు ఉంటాయి.
చెట్లుపైన, ఇంటి కప్పులమీద గూడు కట్టుకుంటాయి. సంవత్సరానికోసారి కొత్తగూళ్లను కట్టుకుంటాయి. ఒకటి నుంచి ఏడు గుడ్లు దాకా పెడతాయి.
వీటి కంటిచూపు అద్భుతం. గాల్లోనుంచి పురుగులు, చేపలను పసిగట్టి వేటాడతాయి.
పచ్చికబయళ్లు, సరస్సులు, నదులు.. ప్రాంతాల్లో ఉంటాయి,
జతపక్షులు రెండూ కలసి గూళ్లు కట్టుకుంటాయి. పిల్లలు వచ్చాక వాటిని ప్రేమగా చూసుకోవటంలో వీటికివే సాటి.
భూమ్మీద ఉండే పురుగులు తింటాయి. అయితే ఎక్కువగా నీటిలో ఉండే చేపలు, ఇతర జీవులను తింటుంటాయి.
7 లక్షల పైచిలుకు వీటి సంఖ్య ఉంది.
ఇవి సోషల్‌గా మూవ్ అవుతాయి. ముప్ఫయ్యేళ్లపాటు జీవిస్తాయి.