Paradise Bird ; మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-08-31T23:34:09+05:30 IST

ఈ పక్షి పైభాగం నల్లగా, కిందిభాగం తెలుపు, పసుపు రంగు ఉంటుంది. దీని తల మీద నుంచి రెండు వైపులా పొడవైన ఈకలు ఉంటాయి. ఈక పుల్లలా సన్నగా ఉంటుంది.

Paradise Bird ; మీకు తెలుసా?

  • ఈ పక్షి పైభాగం నల్లగా, కిందిభాగం తెలుపు, పసుపు రంగు ఉంటుంది. దీని తల మీద నుంచి రెండు వైపులా పొడవైన ఈకలు ఉంటాయి. ఈక పుల్లలా సన్నగా ఉంటుంది. ఈ పక్షిని కింగ్స్‌ ఆఫ్‌ సక్సేనా ఆఫ్‌ ప్యారడైజ్‌ అని పిలుస్తారు.

  • ఈ పొడవైన ఈకల్ని తన రెక్కల మీదుగా, తోక కిందికి, కొమ్ముల్లా ఇలా సులువుగా కదిలిస్తుంది.

  • చెట్ల కొమ్మల మీద కూర్చుని హాయిగా కదులుతూ.. గట్టిగా అరుస్తూ ఈ పొడవైన రెక్కలను కదుపుతుంటే.. ఏవో దారాలు పక్షికి కట్టారా అన్నట్లుంటుంది.

  • ఈ ప్యారడైజ్‌ జాతికి చెందిన పక్షులు 45 రకాలు. ఈ సక్సేనా పక్షులు న్యూగినియాలోని పర్వత ప్రాంతాల్లోని అంచుల్లో నివసిస్తాయి. ముఖ్యంగా ఇవి రెయిన్‌ ఫారెస్టులోనే జీవించటానికి ఇష్టపడతాయి. ఈ పర్వతాలు సముద్ర మట్టానికి 250మీ. ఎత్తులో మాత్రమే ఉంటాయి. అంటే అంత ఎత్తులో మాత్రమే ఈ పక్షులు జీవిస్తాయి.

  • పండ్లు, సాలె పురుగులు, చిన్న కీటకాలను తిని బతుకుతాయివి.

  • మగ పక్షి అందంగా ఉంటుంది. వీటికి మాత్రమే పొడవైన ఈకలు ఉంటాయి. వీటి పొడవు 50 సెం.మీ.

  • 22 సెం.మీ పొడవు ఉంటాయి. 100 గ్రాముల లోపే వీటి బరువు ఉంటుంది.

  • ఈ పక్షులు ఒంటరిగా మాత్రమే ఉంటాయి. ఆడ పక్షులను ఆకర్షించటానికి ‘తుర్‌ తుర్‌...’ అంటూ అరుస్తాయి. ఒక్కోసారి మూడు లేదా నాలుగు పక్షులు గుంపులుగా ఉంటాయి. మగపక్షులు పోటీ పడి మరీ గట్టిగా కూస్తుంటాయి.

  • ఆకులతో, పుల్లలతో గుండ్రంగా చెట్ల అంచుల్లో గూడు కట్టుకుంటాయి. కేవలం ఒకే గుడ్డు మాత్రమే పెడతాయి. 22 రోజులు పాటు పొదుగుతాయి.

  • వీటి గుడ్లను పాములు తినే అవకాశం ఉంది. అయితే ఈ పక్షులకు మాత్రం ఎవరితో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అంత ఎత్తుకు మిగతా పక్షులు, జంతువులూ, మనుషులూ పోలేరు.

Updated Date - 2023-08-31T23:34:09+05:30 IST