Donkey : గాడిద అప్యాయత
ABN , First Publish Date - 2023-08-15T23:11:22+05:30 IST
ఒక ఊరిలో ఓ వర్తకుడు ఉండేవాడు. అతని దగ్గర ఓ గాడిద, కుక్క ఉండేవి. రెండూ స్నేహంగా ఉండేవి. వర్తకుడు తన సరకును అమ్మటానికి గాడిదపై తీసుకుని వెళ్లేవాడు. గాడిద నడిచి నడిచి ఆయాస పడేది. బరువు తట్టుకోలేక కూలబడిపోయేది.
ఒక ఊరిలో ఓ వర్తకుడు ఉండేవాడు. అతని దగ్గర ఓ గాడిద, కుక్క ఉండేవి. రెండూ స్నేహంగా ఉండేవి. వర్తకుడు తన సరకును అమ్మటానికి గాడిదపై తీసుకుని వెళ్లేవాడు. గాడిద నడిచి నడిచి ఆయాస పడేది. బరువు తట్టుకోలేక కూలబడిపోయేది. అయినా వర్తకుడు పట్టించుకునేవాడు కాదు. పని చేయకుంటే కర్రతో చితకబాదేవాడు. తన్నేవాడు. దీంతో గాడిద ఎప్పుడూ లోలోన భయపడేది. బాధపడేది. కుక్క మాత్రం దర్జాగా ఉండేది.
ఒక రోజు కుక్కతో పాటు గాడిద బయటకు వెళ్లింది. ‘నీకంటే నాకే ఎక్కువ యజమాని విలువ ఇస్తాడు’ అన్నది కుక్క. దీంతో గాడిద బాధపడింది. ఇంటికి వచ్చాక కుక్కకు యజమాని మాంసం వేశాడు. తోక తిప్పుతూ యజమాని వెంట తిరిగింది. దాని తలమీద చేయి పెట్టి నిమిరాడు. ఆ కుక్క హాయిగా నిద్రపోయినట్లు పడుకుంది. గాడిద మనసులో ఇలా అనుకుంది. అయినా ఈ కుక్క ఏరోజు చిన్న పని కూడ చేయలేదు. దీనికెందుకు ఇంత విలువ ఇస్తాడో యజమాని? పైగా మాంసాహారం పెడతాడు అనుకున్నది. అసలు కుక్కలో ఉండే గొప్పతనమేమి? నాలో లేని గొప్పతనమేమీ? పనికి విలువ లేదా? అనుకుంటూ తెగ బాధపడింది. చివరికి కుక్కలా తానూ నటించాలనుకుంది.
ఒక ఐదు రోజుల పాటు యజమాని దూరం ప్రాంతాలకు పని మీద వెళ్లాడు. ఆరోరోజు ఉదయమే వ్యాపారి వచ్చాడు. కుక్క కంటే ముందుగా తోక ఊపుతూ.. యజమానిని ముద్దాడినట్లు వేగంగా వెళ్లింది గాడిద. యజమాని బిత్తరపోయాడు. పెద్ద కర్రతో గాడిదను బాదాడు. గాడిద బయటకు పరిగెత్తింది. కుక్క మాత్రం చూస్తూ ఉండింది. ఆ తర్వాత తీరిగ్గా యజమాని దగ్గరకు వెళ్లి తోక ఆడించింది. యజమాని ఆడుకుని తన ప్రేమను చూపాడు. గాడిద దూరం నుంచి చూస్తుండిపోయుంది. ఎవరినీ అనుకరించకూడదు. ఈ జన్మకు నా బతుకు ఇంతే అనుకుంది గాడిద.