Share News

Education : అక్కరకు రాని విద్య

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:07 AM

అనగనగా ఓ ఊరు. ఆ ఊరిలో ఒకప్పుడు బాలాజీ అనే దొంగవాడు ఉండేవాడు. ఆ దొంగవాడు బహు గట్టివాడు. ఎక్కడ దొంగతనం చేయాలన్నా.. తను అనుకున్న పని నెరవేరేది. అలా బంగారం, ధనం, ధాన్యాలు.. ఇలా అన్నీ దొంగతనాలు చేసి

Education : అక్కరకు రాని విద్య

అనగనగా ఓ ఊరు. ఆ ఊరిలో ఒకప్పుడు బాలాజీ అనే దొంగవాడు ఉండేవాడు. ఆ దొంగవాడు బహు గట్టివాడు. ఎక్కడ దొంగతనం చేయాలన్నా.. తను అనుకున్న పని నెరవేరేది. అలా బంగారం, ధనం, ధాన్యాలు.. ఇలా అన్నీ దొంగతనాలు చేసి దొరక్కుండా ఉండేవాడు. అతని అదృష్టమేంటంటే...తోడు దొంగను నమ్మడు. అందువల్ల ఒంటరిగా దొంగతనం చేసి జాగ్త్రగా వెళ్లిపోయేవాడు. ప్రతిరోజూ దేవున్ని మొక్కుని మరీ దొంగతనానికి వెళ్లేవాడు. దొంగతనం చేస్తున్నావా? అని ఆ ఇంటి ఇల్లాలు అడిగేది కాదు. అతనికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి, అబ్బాయి. ఒక రోజు దొంగతనం చేస్తున్నప్పుడు ఓ పహిల్వాన్‌కు దొరికాడు బాలాజీ. దేహశుద్ధి చేశాడు. పైగా భటులకు అప్పచెప్పితే కారాగారం పాలయ్యాడు.

దొంగ బయటకు వచ్చిన తర్వాత ఆ ఊరు విడిచి వెళ్లాడు. దొంగతనం మానేయాలనుకున్నాడు. చూస్తుండగానే ఏళ్లు గడిచాయి. తన కూతురు పెళ్లి ఈడుకు వచ్చింది. ఒక్కసారి చివరి సంవత్సరాల్లో.. అది కూడా వృద్ధాప్యం ముందు సంవత్సరం పాటు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే శరీరం సహకరించకపోయె. అందువల్లనే బాధతో ఉండేవాడు.

ఒక రోజు దారింటా వెళ్తుంటే ఓ దొమ్మరి విన్యాసం జరుగుతోంది. అక్కడ ఓ కుర్రోడు కట్టెలు ఎక్కడటంలో, గోడను దూకడంలో సిద్ధహస్తుడుగా ఉన్నాడు. ఆ చురుకు చూసి తన యవ్వనం గుర్తొచ్చింది. నాలానే ఉన్నాడు. ఇతను దొంగతనంకు సహకరించితే చాలు మనకు తిరుగుండదు అనుకున్నాడు. అబ్బాయి అందంగా ఉండటంతో దొంగకు ఓ ఆలోచన వచ్చింది. వెంటనే తన కూతురుకు ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. వారి తల్లిదండ్రులతో మాట్లాడాడు. దొంగ ఇంటికి అబ్బాయి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి చూశారు. అమ్మాయి బావుందని ఆ సంబంధం అంగీకరించారు. అలా తనకూతురు ఒక ఇంటికి ఇల్లాలయ్యింది.

ఒక రోజు ఆ దొమ్మరి అబ్బాయిని పిలిచాడు. నీలాంటి వాడు నాకు అల్లుడుగా రావటం నా అదృష్టం అంటూ పొగడ్తలు కురిపించాడు. ఓ ఇంటిమీదకు దొంగతనానికి వెళ్లాలి అన్నాడు. ఆ కుర్రోడు సరే మామయ్య అన్నాడు. వెంటనే ఓ ఆసామి ఇంటికి దొంగతనానికి వెళ్లారు. ఈ గోడ దూకి లోపల తలుపులు తీయమని అల్లుడుకు చెప్పాడు బాలాజీ. అల్లుడు ఒకటే ఏడుపు. మామయ్య నాకు దొమ్మర ఆట వచ్చు. ఇలా దూకడం రాదు. కట్టెలు లేవు. తప్పెట లేదు. డ్రమ్ము లేదు. ఇలా అయితే నేను దూకలేనే అన్నాడు. అక్కరకు రాని విద్య ఉపయోగమేంటీ? అన్నాడు బాలాజీ. కూతురు భర్త కాబట్టి ఏమీ చేయలేక తోడు దొంగ లేకపోయెనే అని బెంగ పడ్డాడు.

Updated Date - Dec 28 , 2023 | 03:07 AM